Breaking News

సెంట్రల్ లో 1,460 నూతన పెన్షన్లు మంజూరు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జూలై మాసంలో కొత్తగా 1,460 పింఛన్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో 706 వృద్ధాప్య పింఛన్లు కాగా 511 వితంతు, 242 దివ్యాంగ, ఒక డయాలసిస్ ఫింఛన్ ఉన్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 24,542 మంది పింఛన్ దారులకు ప్రతినెలా రూ. 6 కోట్ల 31 లక్షల 85 వేలు అందజేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీటితో పాటుగా కొత్తగా మంజూరైన 1,460 పెన్షన్లకు సంబంధించి రూ. 37 లక్షల 79 వేలు కలుపుకుని మొత్తం 26,002 మందికి రూ. 6 కోట్ల 69 లక్షల 64 వేల రూపాయలు సోమవారం నుంచి అందజేయడం జరుగుతుందన్నారు. అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులకు ప్రతి నెలా అందిస్తున్న పింఛన్లు.. దేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే అధికమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *