-కులమత జాతులకతీతంగా అన్నదాన కార్యక్రమం భేష్
-శివ సేన అఘోరా స్వామీజీ
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
హజరత్ సయ్యద్ షా బుఖారి నిత్యం లంగర్ ఖనాలో కుల మత జాతులకు అతీతంగా పేదవారి కడుపు నింపడం భేష్ అని మతసామరస్యానికి సరైన నిర్వచనం ఇదేనని అన్నారు శివసేన అఘోర స్వామీజీ. శుక్రవారం నాడు ఒక కార్యక్రమానికి వెళుతూ సయ్యద్ షాఋఖారీ లంగర్ ఖానా గురించి విని సందర్శించి స్వయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామీజీ. దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తరుణంలో లాంటి కార్యక్రమాలు ద్వారా ప్రజలకు శాంతి సందేశం అందించాలని కోరారు. అనంతరం లంగర్ ఖానా (అన్నదాన కేంద్రం) నిర్వహిస్తున్న ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ను కలిసి ప్రశంసించారు.