Breaking News

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పరీక్ష కేంద్రాలను సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారా నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసి పరీక్ష కేంద్రాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
ఈనెల 4వ తేదీ ఆదివారం నిర్వహించే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్ష, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ పరీక్షలకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై శుక్రవారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌, లైజన్‌ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నావల్‌ అకాడమీ పరీక్షలకు 1075 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. ఈ పరీక్షలకు గాను 3 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో కాకరపర్తి భావనారాయణ కళాశాల, ఆంధ్ర లయోలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల, పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కళాశాలలు ఉన్నాయన్నారు. ఈనెల 4వ తేది ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షల నిర్వహణకు 102 మంది ఇన్విజిలేటర్లు, నలుగురు లైజన్‌ ఆఫీసర్లు ఆరుగురు అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లగా నియమించామన్నారు.
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలకు గాను 2 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాల, శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్ధ మహిళ కళాశాల ఉన్నాయన్నారు. ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ కళాశాలలో 480 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఈనెల 4వ తేది ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు, మధ్యాహ్నం 12:00 గంటల నుండి 02:00 గంటల వరకు, సాయంత్రం 03:00 గంటల నుండి 5:00 గంటల వరకు మూడు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్ధ మహిళ కళాశాలలో 393 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఈనెల 4వ తేది ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 12:00 గంటల నుండి 2 :00 గంటల వరకు రెండు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలు నిర్వహించేందుకు ఇద్దరు లైజన్‌ ఆఫీసర్లు, ఐదుగురు అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, పరీక్ష కేంద్రాలలో 80 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తిస్తారన్నారు. పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించి అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి పరీక్ష కేంద్రాలకు ఓఆర్‌యం షీట్లు, బుక్‌లెట్లను తరలించేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి క్యాలిక్యూలెటర్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకుండా పరీక్ష కేంద్రం గేటు వద్దే స్వాదీనం చేసుకోవాలన్నారు. పరీక్ష నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను కోరారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌ కుమార్‌, యుపిఎస్‌సి అబ్జర్వర్‌ మహాబూబ్‌ రజా, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ లైజన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *