అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో గడచిన జూన్ మరియు జూలై నెలలో నేరాలు ఘననీయంగా తగ్గాయని రాష్ట్ర డిజిపి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన డీజీపీ తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పోలీసు అధికారులతో తిరుపతిలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎస్పీలు పీ. పరమేశ్వర్ రెడ్డి తిరుపతి మరియు వై విశాంత్ రెడ్డి చిత్తూరు పాల్గొన్నారు.
రెండు జిల్లాలకు సంబంధించిన డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు ఆయా జిల్లాలలో నేరాల నియంత్రణకు మాదకద్రవ్యాల అమ్మకం మరియు సరఫరా నిరోధానికి రోడ్డు ప్రమాదాల నివారణకు, మహిళలపై జరుగుతున్న నేరాల అదుపునకు తీసుకున్న చర్యలపై డీజీపీకి వివరించారు. నేర పరిశోధన, నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులకు డిజిపి సూచనలు సలహాలు ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిత్తూరు తిరుపతి జిల్లాలలో గత సంవత్సరాలలో జూన్ , జులై నెలతో పోలిస్తే 2022 జూన్ ,జులై నెలలో నేరాలు గణనీయంగా తగ్గాయి . సమీక్షలో రెండు జిల్లాలకు సంబంధించిన అధికారులు ఇచ్చిన న్యూమరికల్ డేటా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా వెల్లడించిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను రెండు జిల్లాలలో పోలీసు విభాగం పటిష్టంగా చేపట్టిందని, హాట్స్పాట్లను గుర్తించి ఆ ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని నివారణ చర్యలను తీసుకుంటున్నామన్నారు. లేన్లు, బైలైన్లు కలిసే ప్రధాన రహదారులపై వాహనాల వేగనిరోధానికి బరికేట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రయత్నం వలన రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రమాదాల సంఖ్య దాదాపు జీరో కు చేరుకున్నదని తెలిపారు.
పోలీసు సమాచార వ్యవస్థను పటిష్ట పరిచి వర్గ కలహాలు జరిగే ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటూ ఆ ప్రాంతాలలో ప్రశాంత వాతావరణము నెలకొనేలా అవసరమైన అన్ని చర్యలను రెండు జిల్లాలలో ఇప్పటికే తీసుకున్నారని ఇది ఒక అభినందించదగిన పరిణామం అని తెలిపారు. గతంలో నాలుగు నెలలో రాష్ట్ర వ్యాప్తముగా నాటు సారా తయారు చేయడం దానిని అమ్మడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతుండేవి ,పోలీసు మరియు SEB వారు తీసుకున్న చర్యల వల్ల , 109 నెరస్థుల పై పి డి ఆక్ట్ అమలు చేయడం వలన సారా తయారీ దాదాపు 80 నుంచి 85% తగ్గిందని ఈ విషయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సారా ఈ జీవనోపాధిగా చేసుకొని నేరానికి పాల్పడుతున్న వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టిందని, వారిని వ్యవసాయం వైపు ప్రోత్సహించి నేరాలకు దూరంగా ఉంచేందుకు ఈ పునరావాస చర్యలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ పరివర్తన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వివరాలను వివరించారు.గంజాయి పండిస్తున్న ఏడు మండలాలో ప్రజలను ఆ వ్యాపారం నుంచి తప్పించి వ్యవసాయం వైపుకు ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ పరివర్తనలో భాగం గా రైతు బరోశ కేంద్రాల ద్వారా Silver Oak, Tamarind, Apple, Coconut,వంటి horticultureమొక్కలు మరియు రాగి, వేరుశనగ, కాఫీ, కంది, మిల్లెట్స్ విత్తనాలు 90% సబ్సిడీ తో సరఫరా చేయడం, వంటి ప్రోత్సాహకర కార్యకలాపాలు చేపట్టిందని ఆయన వివరించారు.
ఈ ఆపరేషన్ పరివర్తన కింద రాగి , వేరుశెనగ కాఫీ కందిపప్పు మరియు ఉద్యానవన పంటలకు సంబంధించిన మొక్కలను మరియు విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందని ఆయన వివరించారుఅల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ పథకం విజయవంతమై అక్కడి సుమారు 7500 ఏకరాలో గంజాయి పండించే రైతులలో మార్పు తీసుకొచ్చి గంజాయి పండించడం మరియు అమ్మకానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయబడింది అని తెలిపారు. అదే విధమైన చైతన్యాన్ని ఇక్కడ జిల్లాలలోని రైతులలో కూడా తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మహిళలు, బాలికల పై జరుగుతున్న నేరాలపై రెండు జిల్లాలలోని పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ దృష్ట్యా రూపొందించిన దిశ యాప్ ను అందుబాటులోకి తెప్పించి, మహిళలపై జరుగుతున్న నేరాలను గుర్తించదగిన స్థాయిలో అదుపు చేయగలిగారు అని తెలిపారు.
Tags amaravathi
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …