విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ, 2022 అక్టోబర్ 2 నుండి “మిషన్ క్లీన్ కృష్ణా మరియు గోదావరి” కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినది. కాలువలలో వ్యర్థాలను వేయకుండా పౌరులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా చేయాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. నగర ప్రజలు నిత్యం వ్యర్థాలను కాలువలలో వేయుట వలన దిగువ ప్రాంత ప్రజలు వ్యవసాయ, తాగునీటి అవసరాలకు వినియోగించే నీరు కలుషితమవుతుందని అన్నారు. ప్లాస్టిక్, లిక్విడ్, నివాస మరియు వాణిజ్య వ్యర్థాలను కాలువలో వేయడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి కాలువ ప్రక్కన నివసించే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, IAS చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరులకు అవగాహన కల్పించడంతో పాటు కాల్వ వంతెనలకు ఫెన్సింగ్, సమాచార సూచిక బోర్డులు ఏర్పాటు చేసి డంపింగ్‌ను అరికట్టేందుకు విజయవాడ నగరపాలక సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందనీ, ప్రతి పౌరుడు తమ చుట్టూ ఉన్న పరిసరాలను తమదిగా భావించి ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటిస్తూ అందుకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నారు. పూల వ్యర్థాలను వేయడానికి తగిన డంపర్ బిన్ లను అందించడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. నగరంలోని కాలువలను పరిశుభ్రంగా మార్చేందుకు మరియు దిగువ ప్రాంతాలలో నివసించే అనేక మంది ప్రజల జీవితాలను రక్షించడానికి, విజయవాడ నగర ప్రజలందరూ ఈ మిషన్‌లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, IAS నగర పౌరులకు పిలుపునిచ్చారు..
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …