Breaking News

అర్జీ దారునికి నమ్మకం కలుగ చేస్తున్నాం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు.

గురువారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు జీ ఎస్, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు – భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీ యం సమీక్షిస్తూ అత్యంత ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డ్ సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన పెండింగ్ మరియు  నూతన పనులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి  తోడ్పాటును అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనం నిర్మానాలు, ఈ – క్రాఫ్ వంటి విషయంలో జిల్లాలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

జిల్లా ప్రగతిపై కలెక్టర్ డా కె. మాధవీలత జిల్లాలో 512 సచివాలయ పరిధిలో 161 సచివాలయలను ప్రజా ప్రతినిధులు సందర్శించడం జరిగిందని, వాటిలో 84 సచివాలయాల కు చెందిన 508 పనులు అప్లోడ్ చెయ్యడం జరిగిందన్నారు. వాటిలో 333 పనులు మంజూరు చేసి 202 పనులను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలియచేశారు. జిల్లాలో ఈ క్రాప్ నమోదు 94 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 135967 మంది రైతులు సాగు చేసే 3,53,375 ఎకరాల్లో 3,33,017 ఎకరాలను ఈ క్రాప్ లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా జిల్లా కి కేటాయించిన 26 లక్షల పనిదినాలు లక్ష్యాలకు గాను 32.61 (125.42%) సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర సగటు వేతనం రూ.210.02 లు ఉండగా , జిల్లా సగటు రూ.217.11 లు ఉందన్నారు. జిల్లా సగటు ను రూ.240 లుగా తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లాలో 390 గ్రామ సచివాలయ భవనాలకు గానూ 282 పూర్తి అయ్యాయని, స్టేజ్ కన్వర్షన్ 39.81 శాతం తో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నామన్నారు. 373 అర్భికే భవనాలకు గానూ 204 పూర్తి అయ్యాయని, స్టేజ్ కన్వర్షన్ 46.75 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నా మన్నారు. 337 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ( ఆరోగ్య భవనాలకు) గానూ 139 పూర్తి అయ్యాయని, స్టేజ్ కన్వర్షన్ 52.53 శాతంతో రాష్ట్రంలో తొలి స్థానంలో ఉన్నామన్నారు. జిల్లాలో 15  పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా 11 భవనాలు పూర్తిచేయగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్ వివరించారు.జగనన్న కాలనీల్లో పూర్తిచేసిన అన్ని ఇళ్లకు మౌలిక సదుపాయాలు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ కల్పిస్తున్నా మన్నారు. అర్హులైన లబ్ధిదారు లందరికీ బ్యాంకుల ద్వారా రూ.35000/- లు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 3 వ ఫేజ్ లో ఇళ్ల నిర్మాణలు చేపట్టెందుకు కార్యాచరణతో సిద్ధంగా వున్నామన్నారు.

స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ రీ ఓపెన్ కాకుండా సమగ్ర విచారణ చేసి పరిష్కరించడానికి చర్యలు తీసుకుటున్నామని తెలిపారు. ఎస్ ఎల్ ఏ కి లోపలే ఆర్జీలు పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పరిష్కరించిన అర్జీ వివరాలు ఫోటో తో సహా ఆన్ లైన్ అప్ లోడ్ చెయ్యాడంతో ఆయా పరిష్కారం కానీ వాటికి అర్జీ దారునికి నమ్మకం కలుగ చేస్తూన్నామని అన్నారు. భూసంబంద అంశాలు, జాతీయ రహదారులకు చెందిన భూసేకరణ, తదితర అంశాల పై వివరాలు అందించడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ .. ఏబివి ప్రసాద్, సీపీవో ఎస్. ప్రకాష్, జిల్లాలో హోసింగ్ అధికారి బి. తారాచంద్, సీపీఓ కె.ప్రకాష్, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఈ డి. భాల శంకర్, డి ఎల్ డి వో లు పి. వీణాదేవి, వి. శాంతమణి తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *