మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న లేఔట్లకు, వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు భూ సేకరణ పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు తాసిల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో తాసిల్దార్లు సహకార శాఖ అధికారులతో డిఆర్వో సమావేశం నిర్వహించి పెండింగ్ భూ సేకరణ పనులు పెండింగ్ కోర్టు కేసులు, రీ సర్వే సమీక్షించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్ల స్థలాల కోసం జగనన్న లేఔట్లు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జిల్లాలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టిందన్నారు ఇంకా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల మంజూరుకు లేఅవుట్లు ఏర్పాటుకు చేపట్టిన అవసరమైన భూసేకరణ ప్రక్రియ అంశాల వారి సమీక్షించారు. భూసేకరణ చేసిన భూములకు చెల్లింపులకు పెండింగ్ బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. జగనన్న పాలవెల్లువ అమలు జిల్లాకు మంజూరైన 194 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటుకు 188 యూనిట్లకు భూమి గుర్తించి హ్యాండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు జిల్లాలో 580 గ్రామాలకు గాను 517 గ్రామాల్లో ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది అన్నారు వీటి ఏర్పాటుకు ఇప్పటికే 286 యూనిట్లకు భూమి గుర్తించి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని, మరో 231 యూనిట్లకు భూమి గుర్తించినట్లు, గుర్తించిన భూమి హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రీ సర్వే 100 గ్రామాల్లో చేపట్టగా ఇప్పటికీ 64 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందన్నారు. ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తయిన గ్రామాలకు సంబంధించి డేటా వెంటనే వెరిఫికేషన్ మొదలు పెట్టాలని, తప్పులుంటే సరిచేసి పంపాలన్నారు. ఈ సమావేశంలో డి సి ఓ ఫణికుమార్ , కలెక్టరేట్ సూపర్నెంట్లు హరినాథ్, రాధిక తాసిల్దార్లు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …