అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2021 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన 9మంది ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు శుక్రవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిశారు. ఐఏఎస్ అధికారుల ప్రొబేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు వారు సిఇఓను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విధానాన్నివారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఇఓ తోపాటు,రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్,రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిఇఓను కలిసిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు పి.ధాత్రిరెడ్డి,మేఘ స్వరూప్,ఫ్రఖర్ జైన్,జి.విద్యాధరి,శివన్నారాయణ శర్మ,అశుతోష్ శ్రీవాస్తవ,అపూర్వ భరత్,రాహుల్ మీనా,ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అనంతరం తాడికొండ గ్రామంలో ఈప్రొబేషనరీ ఐఏఎస్ అధికారుల బృందం పర్యటించి ఓటర్ల నమోదు,ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు.ఈపర్యటనలో డిప్యూటీ సిఇఓ వెంకటేశ్వరరావు,తాడికొండ తహసిల్దార్ ఫణీంద్ర బాబు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …