Breaking News

కృష్ణాజిల్లాలో నేటి నుండి ప్రారంభమైన గ్రామదర్శిని

-గ్రామ దర్శినిలో పెద పులిపాక గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

పెనమలూరు (పెద పులిపాక), నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో నేటి నుండి గ్రామదర్శిని ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష శుక్రవారం పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో పర్యటించి జిల్లాలో గ్రామదర్శిని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలో గ్రామ సచివాలయం, పాఠశాల ,ఆసుపత్రి, చెత్త నుండి సంపద కేంద్రం కలెక్టర్ సందర్శించారు. తొలుత గ్రామ సచివాలయంలో సిబ్బంది హాజరు పరిశీలించారు. సచివాలయంలో ప్రదర్శించిన వివిధ ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితాలు, అనర్హుల జాబితాలు కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో వైయస్సార్ పెన్షన్ కానుక క్రింద 470 మంది, రైతు భరోసా నూరు శాతం పొందారని, అనర్హులు ఎవరు లేరని, జగనన్న అమ్మఒడి పథకం క్రింద 390 మంది లబ్ధి పొందారని, ఎక్కువ మంది అనర్హుల జాబితాలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అందుకు కారణాలు అడిగి తెలుసుకుని అర్హత సాధించడంలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి అర్హులందరికీ పథకాలు అందజేయాలన్నారు. గ్రామంలో వాహన మిత్ర నాలుగో విడత 32 మంది, జగనన్న చేదోడు రెండో విడత 47 మంది, వైయస్సార్ కాపు నేస్తం మూడో విడత 27 మంది, వైయస్సార్ చేయూత మూడో విడత 212 మంది లబ్ధి పొందాలని తెలిపారు.
సచివాలయ పరిధిలో స్పందన అర్జీలు పరిష్కార తీరు పరిశీలించి సంబంధిత రిజిస్టర్లు తనిఖీ చేశారు. జల జీవన్ మిషన్ కింద గ్రామంలో 20 లక్షలతో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు, ఈ పనులు వారంలో ప్రారంభమవుతాయని అధికారులు వివరించారు. గ్రామంలో 208 మంది రైతులు ఉన్నారని, 872 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు ఉందని నూరు శాతం ఈక్రాప్ బుకింగ్ నమోదు చేసినట్లు, ఈ కేవైసీ 96% పూర్తయినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో ఆసుపత్రి సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. బీపీ ఆపరేస్, హిమోగ్లోబిన్ కిట్ పరిశీలించి, స్వయంగా బిపి వైద్య పరీక్ష చేయించుకున్నారు. గర్భవతులకు కిషోర్ బాలికలకు హిమోగ్లోబిన్ రక్ష పరీక్షలు రెగ్యులర్గా నిర్వహించాలన్నారు. తేడాలు ఉన్నవారికి అవసరమైన వైద్యం అందించాలన్నారు గ్రోత్ తక్కువగా ఉన్న పిల్లలు ఎవరూ లేరని వైద్యులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ గ్రామంలో సంపూర్ణంగా నిర్వహించాలన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్రంలో ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమం గ్రామంలో అమలకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామంలో త్రాగునీటి చెరువు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో రేషన్ దుకాణం తనిఖీ చేశారు. ఈపాస్ మిషన్ పరిశీలించి బియ్యం స్టాకు వివరాలు కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామంలో 1350 రైస్ కార్డులు ఉన్నాయని ఒక ఎండియు వాహనం ద్వారా బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఎం డి వాహనం కూడా కలెక్టర్ పరిశీలించి బియ్యం తూకం వేసే మిషన్ కూడా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో ఎం పి యు పి స్కూలు తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు విద్యార్థుల హాజరు పరిశీలించారు. పాఠశాలలో 127 మంది విద్యార్థులు 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి అన్నం ఇంకా కొంచెం ఉడకాలని భోజనం తయారు చేసిన వారికి సూచించారు. జగనన్న విద్యా కిట్ పాఠశాలలో అందరికీ పంపిణీ చేశారని అయితే కొంతమందికి షూస్ కొలతలు సరిపోలేదని, మార్పించి తిరిగి పంపిణీ చేశామనీ హెచ్ఎం తెలిపారు. పాఠశాలలో టాయిలెట్స్ నిర్వహణ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి చెందారు.రెండు అదనపు తరగతి గదులు అవసరమని తెలుపగా నాడు నేడు క్రింద ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు జిల్లాలో 70 మంది పైగా అధికారులు గ్రామదర్శిని లో పాల్గొన్నారు. గుర్తించి వాటిని పరిష్కరించడం గ్రామదర్శిని లక్ష్యమన్నారు. యనమలకుదురు లాకుల వద్ద గతంలో నిర్మించిన డబల్ లైన్ బ్రిడ్జి పరిశీలించారు. అప్రోచ్ లు ఏర్పాటు చేయక ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రాలేదని, అందుబాటులోకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమాల్లో తాసిల్దారు బద్రు ఎంపీడీవో సునీత శర్మ ఎంఈఓ కనకమహాలక్ష్మి,పెద పులిపాక గ్రామ సర్పంచ్ శ్రీనివాస చౌదరి, వైయస్సార్ తాడిగడప మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ ప్రకాష్ రావు ఇరిగేషన్ ఏఈ అజీముద్దీన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *