రేణిగుంట, శ్రీనివాసపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింట వైద్యం- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం తిరుపతి జిల్లాలో 33 గ్రామాలలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఇంటింటి వైద్యం- ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు 104 వాహనం ద్వారా ఇంటింటికి వైద్యం కార్యక్రమం ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాధారణ జబ్బులైన బిపి షుగర్ తదితర జబ్బులకు నెలకు సరిపడా మందులను అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ చూస్తారని, పాఠశాలల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద గర్భవతులు, పిల్లలకు, తల్లులకు ఏనీమియా తదితర పరీక్షలు చేసి మధ్యాహ్నం ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయబడిన దీర్ఘకాలిక రోగులకు ఇంటి వద్ద పరీక్ష చేసి మందులు అందించడం జరుగుతుందని ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంటింటా వైద్యం ప్రారంభించనున్న సందర్భంగా మొదటగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ బి పి లను చెక్ చేసుకున్నారు. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 21 గ్రామాలు, శ్రీనివాసపురం గ్రామంలో 115 కుటుంబాల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య విషయాలు అవసరమైన వైద్య సేవలను అందించారు. శ్రీనివాసపురం గ్రామంలో నేడు జరిగిన ఇంటింట వైద్యం కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలో పాల్గొన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నోడల్ ఆఫీసర్ హనుమంతరావు, డిప్యూటీ డిఎంహెచ్వో సుధారాణి, డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డి, డాక్టర్ పవిత్ర ,ఏఎన్ఎం లలిత , ఆశ రమాదేవి, 104 నవీన్ , సూపర్వైజర్ సరస్వతమ్మ, డిప్యూటీ డిఎంహెచ్ సుధారాణి, ఎం ఎల్ హెచ్ పి లు రోజా, తేజశ్రీ జిల్లా కలెక్టర్ పర్యటనలో తాసిల్దార్ శివప్రసాద్ , రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …