-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-60 వ వార్డు 264 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం 60 వ డివిజన్ 264 వ వార్డు సచివాలయం పరిధి D-బ్లాక్ లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి బెవర నారాయణ, కోఆర్డినేటర్ బత్తుల దుర్గారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 220 గడపలను సందర్శించి వార్డులోని అవ్వాతాతలు, మహిళలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ విస్తృతంగా పర్యటించారు. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం అర్థరాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన దుస్థితి ఉండేదని.. కానీ నేడు ఇంటి గుమ్మం వద్దకే పింఛన్ అందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత పాలకులు ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మల్లాది విష్ణు అన్నారు. కానీ సంక్షేమ పథకాలను నేరుగా పేదలకు చేరువ చేయడంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
చిరు వ్యాపారులకు కొండంత అండగా జగనన్న తోడు
చిరు వ్యాపారులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో భాగంగా పలువురు వీధి వ్యాపారులతో ఆయన ముచ్చటించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోజువారీలకు చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించడంతో.. సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలకే చెల్లించేవారని గుర్తుచేశారు. వీరి కష్టాన్ని స్వయంగా పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జగనన్న తోడు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేకుండా రూ.10వేలు అందుతుందని, ఈ రుణం సంవత్సర కాలంలో వడ్డీలేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. రుణం చెల్లిస్తే మరోసారి రూ.10వేలు తీసుకునే అవకాశం ఉందన్నారు. విజయవాడ నగర పరిధిలో ఈ ఏడాది 5,330 మంది వీధి వ్యాపారులకు పథకం మంజూరు కాగా.. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 1,831 మందికి రూ.4,96,117 వడ్డీ జమ చేయటం జరిగిందన్నారు. అంతే కాకుండా మరో 318 మందికి రూ. 31.80 లక్షలు మూడో విడత కింద రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకాన్ని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగదు బదిలీ సహా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలను ఆర్థిక నిపుణులు సైతం కీర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్క పేద కుటుంబానికి ఏదో ఒక పథకం రూపంలో చేకూరుతున్న మేలును చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాలన్నీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలందరూ నిశీతంగా గమనిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కలయికే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని పొత్తులు, ఎత్తులు వేసినా 2024లో వైఎస్సార్ సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, ఏఈ అరుణ్ కుమార్, నాయకులు అలంపూర్ విజయ్, ఇస్మాయిల్, బాబు, కిరణ్, ఫాతిమా, కుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News