విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరాటే చాంపియన్ షిప్ ICF ప్లానిసమీ ఇండోర్ స్టేడియం, ICF చెన్నై అక్టోబర్ 16,2022న జరిగిన పోటీల్లో చైతన్య స్కూల్ కు చెందిన 4వ, తరగతి చదువుతున్న ముత్తే శివ శ్రీకర్, 9వ సంవత్సరం విభాగంలో బంగారు పతకం సాధించిగా,11వ సంవత్సరం విభాగంలో ముత్తే శివాభిషేక్ ,పలగాని చరిత్ర కాంస్య పతకం సాధించినందుకు శ్రీ చైతన్య ప్రధానోపాధ్యాయులు గంటల రామ్ మోహనచారి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైతన్య విద్యాసంస్థల EGM-M.మురళీకృష్ణ, RI-V.నరేంద్ర, కరాటే కోచ్ -J.విద్యాధర్ పాల్గొన్నారు.వీరు ఆటల్లోనే కాకుండా చదువులోను ప్రతిభను సాధించాలని ఆకాంక్షించారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …