గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి 67వ జన్మదిన వేడుకలు ఈనెల 24వ తేదీ గుంటూరులోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయ హాలులో ఆత్మీయుల మద్య నిరాడంబరంగా జరిగింది.ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ గత 45 సంవత్సరాలుగా సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నానని,దాతృత్వం గల సంస్థలను కలుపుకొని సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు.మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా తనకు వస్తున్న జీతభత్యాలను తన జన్మభూమి అయిన టంగుటూరు మండలంలోని కారుమంచి గ్రామ అభివృద్ధికి అందిస్తున్నానని వివరించారు. 1990లో అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన భూమిక వహించటం తత్ఫలితంగా 1991-2001 మద్య అక్షరాస్యత 17 శాతం పెరగటం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార మరియు మార్కెటింగ్ సలహాదారులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి ప్రసంగిస్తూ ప్రస్తుత రాజకీయ జీవితంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అరుదైన వ్యక్తి అని నిరంతరం సామాజిక సేవలో నిమగ్నమై ఉంటున్నారని అభినందించారు.1978 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నిక కావటం,1980 లో ప్రజా చైతన్య వేదికను,1988 లో జన విజ్ఞాన వేదికలను స్థాపించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేధోమదనాన్ని నిర్వహించారని గుర్తు చేశారు.శాస్త్రీయ భావజాల వ్యాప్తి,నిరక్షరాస్యత నిర్మూలన, గ్రామాల అభివృద్ధి,మద్య వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు.సామాజిక,ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను నడుపుతూ పౌర సమాజాన్ని సన్నద్ధం చేస్తున్న మహా మనిషిగా వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అని అభివర్ణించారు.ఈ జన్మదిన వేడుకలు మదర్స ఫౌండేషన్ విద్యార్థుల మద్య కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యాప్రదాత బండి సాహితి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బండి అశోక్ రెడ్డి,ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జి.విజయ సారథి,దీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణ,సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, చరిత్ర అధ్యాపకులు పాలేరు పోతురాజు, వైఎస్ఆర్సిపి నేతలు నీలం సంజీవరెడ్డి, ఉమర్ అలీ,
తుల్లూరు సూరిబాబు, తెలుగు బాషోద్యమ సమాఖ్య కన్వీనర్ డా. వి.సింగరావు,జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్ లతో పాటు కార్యాలయ సిబ్బంది,లక్ష్మణరెడ్డి అభిమానులు,మిత్రులు పాల్గొని ప్రసంగించారు.
Tags guntur
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …