తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నెం.65 మేరకు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం నవంబర్ 1 నుండి జిల్లాలో పటిష్టంగా అమలు చేయడానికి ప్లెక్స్ ప్రింటర్ల యజామానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో ఫ్లేక్స్ ప్రింటర్ల యజమానులతో జిల్లా కలెక్టర్, నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఫ్లెక్సి బ్యానర్ల నిషేధం మంచి కార్యక్రమమని జిల్లాలో దాదాపు 55 మంది తయారీదారులు ఉన్నారని సహకరించాలని అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు తప్పనిసరి ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యానర్ల వాడకం అమలులోకి రావాలని అందుకు కావాల్సిన ప్రభుత్వ సహాయం, రుణ సౌకర్యం కల్పించడం, ఇందులో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత ప్రత్యామ్నాయ శిక్షణ వంటివి కల్పించనున్నామని సూచించారు. మీరు సూచించే సూచనలను ప్రభుత్వ పరిశీలనకు పంపి తగు చర్యలు చేపడతామని అన్నారు. నగరపాలక కమీషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్లెక్స్ బ్యానర్లు బయో డీగ్రేడబుల్ కాదని తప్పనిసరి బయో డీగ్రేడబుల్ వాడవలసి ఉంటుందని సూచించారు. ఫ్లెక్స్ ప్రింటర్ల యజమానులు ప్రింటర్ మిషన్ల మార్పులు కోసం 10 నుండి 15 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రస్తుతం మా దగ్గర ఉన్న నిల్వ మెటీరియల్ సంబందిత సరఫరా దారులు తిరిగి తీసుకోరని, ఇందుకోసం సమయం, ఋణం, సబ్సిడీ వంటివి అందించాలని, నవంబర్ 1 నుండి అపరాధ రుసుము ఒక చదరపు అడుగుకు రూ.100 నిర్దేశించారని ప్రస్తుతం ఉన్న మిషన్లు రెండు, మూడు రోజులు ఆగితే హెడ్ మార్పుకు లక్షల్లో ఖర్చు అవుతుందని జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ఈ సమీక్షలో తిరుపతి జిల్లా ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, గౌరవ అద్యక్షులు శంకర్, ఉదయ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ రాదా కృష్ణ, జనరల్ సెక్రటరీ బాలాజీ, జిల్లాలోని ఫ్లెక్స్ ప్రింటర్ల యజమానులు హాజరయ్యారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …