Breaking News

నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సీజ్ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ కృష్ణ నగర్, బ్రాడిపేట, అరండల్ పేట, నాయుడు పేట, రామన్నపేట, చంద్రమౌళి నగర్, ఎస్.వి.ఎన్ కాలనీ తదితర ప్రాంతాలను పరిశీలించి ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నూరు శాతం పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మైక్రో ప్యాకెట్ల వారీగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, ఏ ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను డంపర్ బిన్ వద్ద లేదా రోడ్ల మీద వేయకుండా పగడ్బందీగా ఇంటింటి చెత్త సేకరణ జరగాలన్నారు. పారిశుధ్య కార్మికులు ఇంటికి వెళ్ళినా చెత్త ఇవ్వకుండా తర్వాత సమయంలో రోడ్ల మీద వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. కమర్షియల్ సంస్థలు ఆయా వ్యర్ధాల సేకరణ వాహనాలకే ఇవ్వాలని, లేకుంటే వారి సంస్థల సీజ్ తప్పదని హెచ్చరించారు. అలాగే శానిటేషన్ డివిజన్ల వారీగా చెత్త తరలింపు వాహనాలు, బిన్స్ వివరాలు ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని, బిన్స్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేయాలని వెహికిల్ షెడ్ డి.ఈ.ఈ.ని ఆదేశించారు. నగరంలో ఎక్కడా గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఉండకూడదని, అందుకు అనుగుణంగా డిప్యూటీ కమిషనర్, సిఎంఓహెచ్, ఎంహెచ్ఓలు శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేస్తూ, ప్రతి రోజు సమీక్ష చేయాలన్నారు. మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు.
నగర ప్రజలనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రత కోసం ప్రజారోగ్య కార్మికులు నిరంతరం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని, ఇంటి వద్దకు వచ్చిన వారికి వ్యర్ధాలు ఇవ్వకుండా రోడ్ల మీద, కాల్వల్లో వేసి అనారోగ్యానికి, నగర అపరిశుభ్రతకు కారణం కావద్దని కోరారు.
అనంతరం హరిహరమహల్ సెంటర్, బిగ్ బజార్ సెంటర్ల లో గార్బేజ్ వల్నబుల్ పాయింట్స్ గమనించి, సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ కు చార్జి మెమో, 144, 126 వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు.
పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ విజయలక్ష్మీ, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, ఎస్.ఎస్. రాంబాబు, శానిటరీ ఇన్సెపెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *