Breaking News

జిల్లాలో డిసెంబర్‌ 21వ తేదీన 12 వేల సామూహిక గృహ ప్రవేశాలు…

-జగనన్న కాలనీలలో సామూహిక గృహప్రవేశాలకు నిర్మాణాలను పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో డిసెంబర్‌ 21న సుమారు 12వేల సామూహిక గృహప్రవేశాలను నిర్వహించేందుకు గృహాలను సిద్దం చేసేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించుకుని అమలు పరచాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జగనన్న కాలనీల గృహ నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, గ్రామ వార్డు సచివాలయ నిర్మాణాలు, స్పందన గ్రీవెన్స్‌ తదితర అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లాకు సంబంధించి స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్‌. హౌసింగ్‌ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు. డిసెంబర్‌ 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా 12,264 గృహాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పేదల సొంత ఇంటి కలను నేరవేర్చాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు యుద్దప్రాతిపదికన పనులను పూర్తి చేసేందుకు అహర్నిసలు కృషి చేయాలన్నారు. స్పెషల్‌ ఆఫీసర్లు హౌసింగ్‌ అధికారులు మండల స్థాయి అధికారులు సంయుక్తంగా గృహ నిర్మాణాలపై ప్రణాళికను రూపొందించి అమలు చేయండం ద్వారా నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సామూహిక గృహ ప్రవేశాలకు గృహా నిర్మాణాలను పూర్తి చేసి సిద్దం చేయడం ప్రతి ఒక్కరూ మహాయజ్ఞంలా పనులను పూర్తి చేసి నిర్మాణాల ప్రగతిలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. ఇసుక, సిమెంట్‌, మెటల్‌ వంటి నిర్మాణ సామాగ్రిని ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. లబ్దిదారుల సమక్షంలో వారు సంతృప్తి చెందేలా పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణాల్లో రూప్‌ కాస్టింగ్‌ దశలో ఉన్న 12,264 గృహాలలో ఇప్పటికే 3,743 గృహాలు పూర్తి చేశామన్నారు. మిగిలిన 8,473 గృహాలలో తిరూవురు నియోజకవర్గంలో 181, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1074, మైలవరం నియోజకవర్గంలో 3602, నందిగామ నియోజకవర్గంలో 2088, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 72, సెంట్రల్‌ నియోజకవర్గానికి సంబంధించి 1021, తూర్పు నియోజకవర్గానికి సంబంధించి 435 గృహాలు పూర్తి చేయవలసి ఉన్నారు. ఆయా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మండలాభివృద్ధి అధికారులు, హౌసింగ్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు రెవెన్యూ అధికారులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సమన్వయంతో పని చేసి గృహా నిర్మాణాలను పూర్తి చేసి పనుల ప్రగతి నివేదికను ఎప్పటికప్పడు సమర్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డిఇవో సివి రేణుక వివిధ శాఖల అధికారులు జిఎస్‌డబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి కె. అనురాధ, కార్పొరేషన్‌ హౌసింగ్‌ ఇఇ రవికాంత్‌ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *