పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల, అంగన్వాడి, ఆసుపత్రి ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే భావితరాలు బాగుంటాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కానూరులో ఐసిడిఎస్ జిల్లా కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సప్లిమెంటరీ న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు వీటితోపాటు ఎనీమియా ముఖ్యమైన కార్యక్రమం అన్నారు. మీ మీ పరిధిలో ఎనీమియా సమస్య ఎదుర్కొనే వారిని గుర్తించి ఎనీమియా నివారణకు ఐరన్ మాత్రలు అందించడం, తక్కువ బరువు గల పిల్లలపై తగిన శ్రద్ధ తీసుకోవడం వారికి అవసరమైన చికిత్స అందేలా చూడడం తద్వారా ఎనీమియా తక్కువ బరువు సమస్యల నుండి వారు బయటపడేలా చేయడం ముఖ్యం అన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని ఈ అంశాలపై ఫోకస్ చేయాలన్నారు. దీనిపై మీ అచీవ్మెంట్ ఆధారపడి ఉంటుందన్నారు
ప్రీస్కూల్ హాజరు ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారి కలెక్టర్ పరిశీలించి హాజరు శాతం పెంపొందించాలన్నారు అంగన్వాడీలపై తగిన పర్యవేక్షణ ఉండాలన్నారు.
వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలు వాటి శాంపిల్స్ కలెక్టర్ పరిశీలించారు.
జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్స్ పంపిణీని జిల్లా కలెక్టర్ ఈరోజు కానూరులో నిర్వహించిన ఐసిడిఎస్ సమీక్ష సమావేశంలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలకు 1751 సెల్ ఫోన్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత ఐసిడిఎస్ పీడీ ఎస్ సువర్ణ ఐసిడిఎస్ కార్యక్రమాలు వైయస్సార్ సంపూర్ణ పోషణ జిల్లాలో సాధించిన ప్రగతి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలో సిడిపివోలు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …