-గ్రీనరీ పెంచేందుకు అవెన్యూ ప్లాంటేషన్
కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష శనివారం కంకిపాడు మండలం, ఉప్పులూరు గ్రామంలో ఉపాధి హామీ క్రింద అవెన్యూ ప్లాంటేషన్ నర్సరీలు సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద గ్రీనరీని పెంపొందించేందుకు అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుకు 53 నర్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయ సంఘాల ద్వారా ఇంటింటికి మొక్కలు సరఫరా చేయడం తద్వారా గ్రీనరీ ని పెంపొందించుటకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలు నూరు శాతం బతికేలా గ్రీనరీ పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.