Breaking News

ట్రీ & వుడ్ షెడ్డర్ మిషన్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలన…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, గురువారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సర్కిల్-3 పరిధిలో గల 10 వ డివిజన్ నందు వాసవి నగర్ లో ట్రీ & వుడ్ షెడ్డర్ మిషను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి మిషను పనుల వివరాలు అధికారులను అడిగితెలుసుకొని దానిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.

నగరంలో ఉన్నటువంటి పార్కులలో, కాలనీలలో, మెయిన్ రోడ్ల పైన విద్యుత్తు శాఖ మరియు నగరపాలక ఉద్యాన వన శాఖ వారు నారికే చెట్లను, చెట్ల కొమ్మలను వెహికల్ లో వేసి సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ కు తరలించడం వలన అవి ఎండిపోయి మండటం వలన ఎక్కువ పొగ రావడం జరుగుతుంది కావున దానిని అరికట్టాడంలో భాగంగా సుమారు ఒక గంటకు 3 నుండి 4 టన్నుల సామర్ధ్యం కలిగిన ట్రీ & వుడ్ షెడ్డర్ మిషన్ ను నగరపాలక సంస్థ వారు కొనుగోలు చేయడం జరిగిందని, దీని వలన నాలుగు అంగుళాల లోపు లావు గల చెట్ల కొమ్మలను వుడ్ షెడ్డర్ మిషన్ లోకి పంపడం ద్వారా కంపౌస్ట్ (పొడిగా) రావడం వల్ల 3 నుండి 4 లారీల్లో పట్టే కొమ్మలను ఒక చిన్న ట్రాక్టర్ లో కంపౌస్ట్ (పొడిగా) తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని వలన రోజుకి సుమారు 3 నుండి 4 టన్నుల కంపౌస్ట్ (పొడి) నగరంలో ఉత్పత్తి అవుతుంది. ఈ కంపౌస్ట్ (పొడిని) వుడ్ ను వర్ణి కంపౌస్ట్ ప్లాంట్ నందు బెడ్డుగా మరియు కార్కానలలో వంట చేరకుగా వాడవచ్చు. ట్రయిల్ బేస్ మీద ఈ మిషన్ ను తీసుకోవడం జరిగినది ఇది విజయవంతం అయినందున ఇంకో మూడు మిషన్లు కొనడానికి కమిషనర్ గారు ఆదేశాలు జారిచేసినారు.

సర్కిల్-3 పరిధిలో 10 వ డివిజన్ నందు పంటకాలువ రోడ్డు, న్యూపోస్టల్ కాలనీ, HT లైనులలో గల సమస్యలను గుర్తించి అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పర్యవేక్షించి శానిటరీ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో వ్యర్ధములను తొలగించి మురుగునీటి పారుదల సక్రమముగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారు, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *