Breaking News

ఒక పక్క సంక్షేమం.. మరోపక్క అభివృద్ధి.. ఇవే జగన్ లక్ష్యాలు — మంత్రి జోగి రమేష్

-చినపాండ్రాకలో రూ. 99.15 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
-రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన శీతనపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం
-చిన చందాలలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెన ప్రారంభం
-కృత్తివెన్ను గ్రామంలో రూ.22.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

కృత్తివెన్ను (చినపాండ్రాక/శీతనపల్లి/చిన చందాల/), నేటి పత్రిక ప్రజావార్త :
ఒకపక్క ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం, మరోపక్క రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన దృష్టిని కేంద్రీకరించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
గురువారం ఆయన కృత్తివెన్ను మండలంలో పలు గ్రామాల్లోని అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చినపాండ్రాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా నాడు-నేడు రెండవ దశ కార్యక్రమం ద్వారా రూ. 99,15,256 వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన, కృత్తివెన్ను గ్రామంలో రూ.40 లక్షలతో గ్రామ సచివాలయం, రూ.21.80 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు మంత్రి జోగి రమేష్ భూమి పూజ చేశారు. దీనితో పాటుగా శీతనపల్లి గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.33 లక్షల వ్యయంతో చిన్న చందాలలో నూతనంగా నిర్మించిన వంతెనలను ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా శీతనపల్లి, చిన్న చందాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు పథకాలను చేరవేసే క్రమంలో దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని తెలిపారు. వాలంటీరు, గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి అసలు సిసలైన అర్ధాన్ని జగన్ సహకారం చేశారన్నారు. అన్ని సేవలను గ్రామాల్లోనే పొందే విధంగా ప్రజల వద్దకే పాలనను చేరువ చేశారన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ కే చెల్లుతుందన్నారు.
చినచందాలలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు 33 లక్షల రూపాయల వ్యయంతో వంతెనను నిర్మించి హామీ నెరవేర్చుకున్నానని అన్నారు. అదేవిధంగా తాడివెన్ను, దోమలగొంది, చినచందాల, పెదచందాల, గరిశపూడి గ్రామాలకు రూ.1.70 కోట్లతో త్వరలో ఇంటింటికి నీటి కొళాయి కనెక్షన్ ఇస్తున్నామని, ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయన్నారు. చినచందాల గ్రామస్తుల కోరిక మేరకు రెండు రేవు నిర్మాణాలు, సీసీ రోడ్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మండల పరిధిలోని అర్హులైన రైతులకు వారి పొలాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను జెడ్పీటీసీ మైలా రత్న కుమారి, బంటుమిల్లి జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ, బంటుమిల్లి, కృత్తివెన్ను ఎంపీపీలు వెలివెల చినబాబు, కూనసాని తాతాజీ, కృత్తివెన్ను ఎంపిడిఓ జీ.పిచ్చిబాబు, కృత్తివెన్ను తాసిల్దారు రామకోటేశ్వరరావు, పాండ్రాక, శీతనపల్లి, గరిశపూడి గ్రామాల సర్పంచులు కోడ్రు బాయమ్మ, కూనసాని సునీత, నాగిడి నాగార్జున, కృత్తివెన్ను మండల ఏవో ప్రశాంతి, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *