-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి సందర్శించిన సందర్బంలో ఎంట్రన్స్ గేట్లు మూడు చోట్ల ఏర్పాటు చేయాలనీ మరియు ప్లాంట్ ఆవరణలో చెత్త తరలించు వాహనముల రాకపోకలకు ఇబ్బందిగా ఉండుట గమనించి అక్కడ ఇంటర్నల్ రోడ్ల పనులను చేపట్టాలని మరియు వాహనముల సర్వీసింగ్ ర్యాంప్ ను పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటితో పాటుగా ఎక్సెల్ ప్లాంట్ యొక్క కంపౌన్ వాల్ పనులు వేగవంతము చేయాలని సూచిస్తూ, ప్లాంట్ ఆవరణలో శానిటరీ ఆఫీసు బిల్డింగ్, స్టోర్ రూమ్, డ్రైవర్స్ టాయిలెట్స్(రెస్ట్ రూమ్) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్లాంట్ ఆవరణలో అవసరమగు ప్రదేశాలలో సి.సి కెమరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్బంలో నగరంలో కొబ్బరి బొండాల విక్రయదారులు పారవేసిన బొండాలను నేరుగా కాకుండా 4 ముక్కలుగా కట్ చేసిన వాటిని మాత్రమే ఎక్సెల్ ప్లాంట్ నకు తరలించునట్లుగా చూడాలని సూచిస్తూ, అందరు శానిటరీ ఇన్స్ పెక్టర్లు విధిగా వారి వారి వార్డ్ ల యందలి కొబ్బరి బొండాల వ్యాపారులకు వివరించి విధిగా ముక్కలు చేసిన బొందాలను మాత్రమే ప్లాంట్ నకు తరలించునట్లుగా చూడాలని ఆదేశించారు. అదే విధంగా చెత్త తో పాటుగా కాకుండా చెట్ల కొమ్మలను వేరుగా ప్లాంట్ నందలి ఉడ్ ఛాపర్ మిషన్ ప్లాంట్ నందు అందచేయాలని సూచించారు. ప్లాంట్ ఆవరణలో గల సమస్యలను గుర్తించి అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.