-స్పందనలలో 29 అర్జీలను స్వీకరన
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, మేనేజర్ బి.శ్రీనివాస్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 10 అర్జీలు
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 1 కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ విభాగం – 1, రెవిన్యూ – 1, ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళికవిభాగం – 1 అర్జీలు, సర్కిల్ –3 కార్యాలయంలో ఉద్యనవన విభాగం – 1, పట్టణ ప్రణాళికవిభాగం – 2 అర్జీలు, మరియు సర్కిల్ – 2 కార్యాలయంలో ఉద్యనవన విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 1 అర్జీలు అందించునట్లు జోనల్ కమిషనర్లు తెలియజేసారు.