విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో గృహప్రవేశాలకు గృహాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, నాడు`నేడు పనుల ప్రగతి, స్పందన గ్రీవెన్స్ వంటి పలు అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి మండల స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్. హౌసింగ్ ఇఇలు, డిఇలు, ఏఇలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో వివిధ దశలలో జరుగుతున్న గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో డిసెంబర్ 21వ తేదిన నిర్వహించే 12,264 గృహాలలో లబ్దిదారులతో గృహ ప్రవేశాలకు నిర్ణయించామన్నారు. పేదోడి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం మేరకు చేపట్టిన గృహా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. యంపిడివోలు, తహాశీల్థార్లు, హౌసింగ్ ఏఇల ఆధ్వర్యంలో ఏర్పడిన టీమ్‌లతో గ్రామ, వార్డు సచివాలయల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నమన్వయం చేసుకోవాలన్నారు. గృహ ప్రవేశాలకు నిర్థేశించిన వారం వారి లక్ష్ష్యాల మేరకు గృహాలను సిద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా రూప్ కాస్టింగ్ దశలో ఉన్న వాటిని పూర్తి చేయాలన్నారు. నిర్థేశించిన 12,264 గృహాలలో ఇప్పటికే 4207 గృహాలు పూర్తి చేశామన్నారు. మిగిలిన 8057 గృహాల నిర్మాణాలను వారం వారిగా లక్ష్యాలను నిర్థేశించుకుని పూర్తి చేయాలన్నారు. తిరూవురు నియోజకవర్గంలో 392 గృహాలకు గాను 199 గృహాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలన193, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 1713 గృహాలకు గాను 688 గృహాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలన 1025, మైలవరం నియోజకవర్గంలో 5184 గృహాలకు గాను 1796 గృహాలు పూర్తి చేయడం జరిగిందని, మిగిలన 3388, నందిగామ నియోజకవర్గంలో 3144 గృహాలకు గాను 117 గృహాలు పూర్తి చేయగా, మిగిలన 1967, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 135 గృహాలకు గాను 73గృహాలు పూర్తి చేయగా, మిగిలన 62, సెంట్రల్ నియోజకవర్గంలో 1196 గృహాలకు గాను 188గృహాలు పూర్తి చేయగా, మిగిలన 1008,తూర్పు నియోజకవర్గంలో 500 గృహాలకు గాను 86 గృహాలు పూర్తి చేయగా, మిగిలన 414, గృహాలు పూర్తి చేయవలసివున్నాయన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణాలలో తుది దశలో ఉన్న రూప్ కాస్టింగ్‌లోని గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మండలాభివృద్ధి, హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, హౌసింగ్ పిడి శ్రీదేవి, డ్వామా పిడి జె. సునీత, జిఎస్‌డబ్ల్యుఎస్ జిల్లా అధికారి కె. అనురాధ, కార్పొరేషన్ హౌసింగ్ ఇఇ రవికాంత్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …