-స్టార్ రేటెడ్ గృహోపకరణాల పంపిణి కీ ఏపీఈఆర్సి గ్రీన్ సిగ్నల్
-వడ్డీ లేని నెలవారీ సులభ వాయిదాల పద్ధతిలో స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్లు , ఫ్యాన్లు , ఎల్ఈడీ ట్యూబ్ లైట్ల పంపిణీ పై ఏపీ డిస్కాములు , ఏపీ సీడ్కో ప్రతిపాదనకు ఏపీఈఆర్సి ఆమోదం
-ఇంధన సామర్ధ్య గృహోపకరణాల వినియోగంతో విద్యుత్ వినియాగం, విద్యుత్ బిల్లుల ఆదా , పర్యావరణ పరిరక్షణ — ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సివీ నాగార్జున రెడ్డి
-సాంప్రదాయ గృహోపకరణాల స్థానంలో ఇంధన సామర్ధ్య గృహోపకరాణాల వలన 25 నుంచి 30 శాతం విద్యుత్య్ ఆదా కు అవకాశం
-ఇంధన సామర్ధ్య ఉపకరణాల వల్ల జీవన ప్రమాణాల మెరుగుదల
-ఇంధన సామర్థ్యం వల్ల వినియోగదారులకు , డిస్కాములకు ప్రయోజనం
-మార్చి 31 లోగా పైలట్ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని ఏపీఈఆర్సి ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి కుటుంబం విద్యుత్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవటం ద్వారా ప్రయోజనం పొందే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సి) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్యం తో కూడిన స్టార్ రేటెడ్ పరికరాలను మార్కెట్ కన్నా తక్కువ ధరకు అందించడం ద్వారా , విద్యుత్ వినియోగంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా కొంత మేర తగ్గేలా చర్యలు తీసుకుంటోంది.
ఇందుకోసం ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ , అప్ ఫ్రంట్ మోడల్ ద్వారా వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్లు , బీఎల్డీసి(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ ) ఇంధన సామర్ధ్య సీలింగ్ ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు వడ్డీ లేని నెలవారి వాయిదా చెల్లింపు పద్దతిలో అందచేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ కు విద్యుత్ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన సామర్ధ్య అభివృద్ధి సంస్థ ( ఏపీసీడ్కో) చేసిన ప్రతిపాదనను ఏపీఈఆర్సి ఆమోదించింది. ఈ మేరకు ఏపీఈఆర్సి ప్రొసీడింగ్స్ (మార్గదర్శకాలను) విడుదల చేసింది
రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ లో 25 శాతం విద్యుత్ , గృహ వినియోగ రంగంలోనే ఉంది. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా గృహాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విరివిగా పెరిగింది.దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది . ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సి సూచన మేరకు తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుని ఎక్కువ సామర్థ్యం ప్రదర్శించే స్టార్ రేటెడ్ గృహోపకరణాలను అందించడం ద్వారా వినియోగదారులు ప్రయోజనం పొందేలా ఒక ప్రాజెక్ట్ ను ఏపీసీడ్కో రూపొందించింది.
స్టార్ రేటెడ్ గృహోపకరణాలు నెలవారీ సులభ వాయిదాల చెల్లింపు పద్ధతిలో వినియోగదారులకు అందచేసి, ఎలాంటి వడ్డీ లేకుండా ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లింపు సమయంలో వినియోగ దారులు చెల్లించేలా ఆ ప్రాజెక్ట్ లో ప్రతిపాదించింది . మార్కెట్ ధరకంటా తక్కువ ధరకే ఈ వస్తువులు వినియోదారులకు అందచేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ డిస్కాములు, ఏపీసీడ్కో అధికారులతో ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్ జస్టిస్ సివీ నాగార్జున రెడ్డి వెబినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన సామర్ధ్య గృహోపకరణాల వినియోగం పై వినియోగదారులలో అవగాహన పెంచాలని సూచించారు . ఈ ఉపకరణాలు వాడకం వల్ల గృహాలలో విద్యుత్ వినియోగం తగ్గి తద్వారా విద్యుత్ బిల్లులు కొంత మేర ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా ఇది పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదపడుతుందన్నారు. సాంప్రదాయ లైట్లు , ఫ్యాన్లు వంటి వాటితో పోలిస్తే ఇంధన సామర్ధ్య ఉపకరనాల వాడకం వల్ల 25 నుంచి 30 శాతం విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా 5 స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్లు , బీఎల్డీసి ఫ్యాన్లు , ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు వంటివాటిని వినియగదారుల కొరిక మేరకు ఏ పీసీడ్కో , ఏ పీ డిస్కాములు సరఫరా చేయనున్నాయి.
తొలి దశలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ను విశాఖపట్నం, విజయవాడ తిరుపతి నగరాల్లో అమలు చేయనున్నారు.దశల వారీగా ఈ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలో విస్తరించి ఇంధన సామర్థ్యం ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా ప్రయోజం పొందేలా చర్యలు తీసుకోవాలని ఏ పీ సీడ్కో , డిస్కాములకు ఏపీఈఆర్సి చైర్మన్ సూచించారు. దీనివల్ల కేవలం విద్యుత్ ఆదా యే కాకుండా ,వినియోగదారుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. అంతేగాక ఇంధన వనరులను కాపాడుకుని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకొనే ఆవశ్యకత పై వినియోగదారులలో అవగాహన ఏర్పడుతుందన్నారు.
ఇంధన పరిరక్షణ, ఇంధన పొదుపు పై పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . రాష్ట్రం లో ఇంధన భద్రత సాదించేందుకు , తద్వారా భావి తరాల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇంధన సామర్థ్యం విశేషంగా దోహద పడుతుందని జస్టిస్ సివీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికీ పూర్తిచేయాల్సిందిగా ఏ పీ సీడ్కో , డిస్కాములను ఆయన ఆదేశించారు.
ఈ ప్రాజెక్టును అమలుచేసేందుకు వివిధ వస్తు తయారీ సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని ఏపీఈఅర్స్ ఏపీ సీడ్కోకు సూచించింది. అలాగే ప్రాజెక్ట్ పూర్తయిన 45 రోజులలోగా ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులు దాని ప్రభావం పై ఏపీఈఆర్సికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
రాష్ట్రం లో ఎనర్జీ ఎఫిసిఎన్సీ ని అభివృద్ధి చేయడం వల్ల వినియోగదారులకు నెలవారీ విద్యుత్ బిల్లుల వ్యయం తగ్గడమే గాక వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చునని, కాలుష్య కారక ఇంధన వినియాగాన్ని కూడా పెద్ద ఎత్తున తగ్గించవచ్చునని ఏపీఈఆర్సి కమిషన్ సభ్యులు పీ రాజా గోపాల్ , రామ సింగ్ ఠాకూర్ లు పేర్కొన్నారు . ఈ వెబినార్లో డిస్కాముల సిఎండీలు , జే పద్మ జనార్ధన రెడ్డి , కె సంతోష రావు, ఏపీఈఆర్సి సెక్రటరీ రాజబాపయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.