విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని నగర మేయర్ రాయున భాగ్యలక్ష్మి ప్రారంభించగా ఏపీఐడిసి చైర్పర్సన్ పుణ్యశీల జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసిపి నాయకులు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండి రూముల్లా, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, 36 డివిజన్ కార్పొరేటర్ బాలి గోవింద్, 39 డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయకుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నీషియన్స్ అందరూ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని సంఘటితమవ్వాలని సూచించారు. అసోసియేషన్ కి ప్రభుత్వం తరఫున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఎయిర్ కండిషన్ మరియు రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ జమీల్ ఖాద్రి, కొమవరపు దివాకర్ లు మాట్లాడుతూ తమ అసోసియేషన్ లో ఎనిమిది వందలకు పైగా టెక్నీషియన్స్ సభ్యత్వం కలిగి ఉన్నారని తెలియజేశారు. శాశ్వత కార్యాలయానికి విజయవాడ పరిసర ప్రాంతాలలో స్థలం కేటాయించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి పి సలాం ఖాన్, కమిటీ సభ్యులు జయ కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …