విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైతన్యవంతమైన సమాజం కోసం మనమందరం కృషి చేయాలని మన జీవన మార్గం సైన్స్ అని విశ్వం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ యూనివర్స్ అన్నారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో గురువారం ప్రపంచ సైన్స్ దినోఉత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అంది ఇవ్వాలని ఆకాంక్షించారు. భూతం వర్తమానం భవిష్యత్తును తెలిపే శాస్త్రీయ విజ్ఞానానికి ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. మేధావులు విద్యావంతులు శాస్త్రి విజ్ఞానాన్ని సమాజంలో విస్తృతంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ విశ్వం ఫౌండేషన్ తరపున ప్రపంచ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వం ఫౌండేషన్ సభ్యులు నార్ని వెంకటసుబ్బయ్య, నియంత, డి తిరుపతి, నాచర్, ఎంకే బెగ్, పాల్గొని ప్రసంగించారు. నగరంలోని వివిధ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్ మీద ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రము అందజేశారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …