విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బుదవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జాతీయ స్థాయి కబడ్డీ జట్టు ఎంపికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టింది . ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లోని టెన్నిస్ కోర్టు నందు కబడ్డీ జట్టు ఎంపికలు పారదర్శకంగా నిర్వహించి 12 మంది క్రీడాకారులను ఎంపిక చేపట్టినట్లు శాప్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది ఎంపికయిన జట్టు నవంబర్ 17 నుంచి 20 వరకు ఉత్తరాఖండ్ లోని రుషికేశ్ నగరంలో జరుగనున్న 48వ జాతీయ స్థాయి జూనియర్ బాలుర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనుంది.
ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు
1. కే. వెంకటేష్
2. సాయి శంకర్
3. వి ప్రవీణ్ కుమార్
4. బి అజయ్ కుమార్
5. యస్ కే. బాషు
6. పి. శ్రీ శివ తేజేష్
7. వి మహేష్
8. పి. కొండలరావు
9. వి దుర్గా ప్రశాంత్
10. పి. గంగబాబు
11. కే. వంశీ కృష్ణ
12. జి. హరీష్