Breaking News

రివ్యూ సమావేశము…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం స్త్రీ శక్తి భవనము నందు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, వై.యస్.ఆర్.క్రాంతి పధం, ప్రాజెక్టు డైరెక్టర్, యస్.సుభాషిణి అధ్యక్షతన రివ్యూ సమావేశము నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమము నకు కొవ్వూరు డివిజన్ పశు సంవర్ధక శాఖ, డిప్యూటీ డైరెక్టర్,  రాధా కృష్ణ మరియు కడియం అసిస్టెంట్ డైరెక్టర్, కె.సత్యనారాయణ , డ్వాక్రా మహిళలు, ఐకెపి సిబ్బంది హాజరైనారు. ప్రాజెక్టు డైరెక్టర్, యస్. సుభాషిణి మాట్లాడుతూ మహిళా సంఘాలకు జీవనోపాదులు అందించుటలో ప్రభుత్వం అందించిన చేయూత పధకము ద్వారా లబ్దిదారులకు వచ్చిన లబ్దితో అనుసందానమై పశువుల కొనుగోలు నిమిత్తము బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, సామాజిక పెట్టుబడి వంటి ఆర్ధిక సంస్థలతో రుణాలు ఇప్పించాలని వాటిని రైతు బరోసా కేంద్రాలలో మా సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ వారి సహాయ సహకారాలతో గ్రౌండింగ్ చేయించి, వాటిని మొబైల్ అప్ ద్వారా నిక్షిప్తం చేయాలని కోరియున్నారు. జమన సంస్థ ద్వారా అనుసందానమై కార్యక్రమలైనటువంటి స్వయం సహాయక సంఘాల రుణాల మజూరులో లక్ష్యాల మేరకు పనిచేయాలని బ్యాంక్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఉన్నతి రుణాలు మంజూరును 100% లక్ష్యాలు చేరేలా సిబ్బంది అందరూ పనిచేయాలని బకాయిలు లేకుండా రికవరీని వసూలయ్యేలా చూడాలని కోరారు. ప్రతి మహిళా సుస్థిరమైన జీవనోపాది పొందేలా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని సిబ్బంది అందరకి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమములో డిపియంలు వై. జనార్ధన రావు, యం.సంపత్ కుమార్, ఏ.గణేశ్, ఇ. రాజ బాబు, బి.హేమంత్, డి.కె.మారుతి, యం.మధు, ఎపియంలు, సి‌సి లు మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొనటం జరిగినది.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *