రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక గౌతమి గ్రంధాలయం ఆవరణలో బుధవారం విశ్రాంత గ్రంధపాలకుల ఆత్మీయ సమ్మేళనం, గ్రంధాలయ ఉద్యమకారుల సంస్మరణ సభ అనంతరం పురాతన నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం నందు సుమారు 35 సంవత్సరాలు విధులు నిర్వహించి అనంతరం గెజిటెడ్ లైబ్రేరియన్ గా నిజామాబాద్ నందు పదవీ విరమణ పొందిన డి ఎస్ ప్రసాద రావు, శీతంపేట శాఖా గ్రంధాలయం నందు గ్రేడ్ I లైబ్రేరియన్ గా విధులు నిర్వహించి అనంతరం శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థలో సెక్రటరీ గా పదవీ విరమణ పొందిన మారిశెట్టి సత్యనారాయణ లను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అరిపిరాల నారాయణ రావు, పెరుమాళ్ల రఘునాథ్ విచ్చేశారు.
ముఖ్య అతిధి గా విచ్చేసిన పెరుమాళ్ల రఘునాధ్ మాట్లాడుతూ ఎందరో మహానుబావులు కృషి ఫలితంగా గౌతమీ గ్రంధాలయం ఈ విధంగా రూపుదిద్దుకొందని వారిలో వొకరైన డి ఎస్ ప్రసాద రావు, మారిశెట్టి సత్యనారాయణ గారిని సత్కరించుకోవడం చాలా మంచి కార్యక్రమం అని తెలియచేసారు. గ్రంధాలయ అధికారి కోండ్రు సుధాకర రావు మాట్లాడుతూ ఎందరో గ్రంధాలయ ఉద్యమకారులు కృషి ఫలితంగా గ్రంధాలయాలు ఈ విధంగా అభివృద్ధిలోకి వచ్చాయన్నారు. అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి వారిని ఈ వారోత్సవాలలో స్మరించుకోవడం వల్ల భావితరాలకు తెలుస్తాయని, గ్రంధ పఠనం మూలంగానే ఎందరో మహానుభావులు ఎంతో ఖ్యాతి సాధించారని అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని పిల్లలందరూ పుస్తక పఠనం ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం పురాతన జిల్లా ప్రతిభా పురస్కార గ్రహీత విశ్రాంత ఉద్యోగి అల్లు రామ కృష్ణ, వాడపల్లి, వారిచే నాణెములు నోట్లు పోస్టల్ స్టాంపుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శనలో 120 దేశములు, 1400 నాణెములు, 300 కరెన్సీ నోట్లు, 800 పోస్టల్ స్టాంప్లు… మొదలైన ఎన్నో విలువైనవి ఉంచడం జరిగింది. ఈ ప్రదర్శనను తిలకించ డానికి వివిధ పాటశాలలనుండీ సుమారు 50 మంది విద్యార్ధులు, పాటకులు విచ్చేశారు.