-చేపల వినియోగాన్ని పెంచేందుకు అక్వా హబ్‌లు ఏర్పాటు…
-జిల్లాలో ఫిష్ రిటైల్ అవులెట్లు ద్వారా మత్స్యకారులకు ఆర్థిక భరోసా…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేపల వినియోగాన్ని పెంచేందుకు జిల్లాలో ఫిష్ రిటైల్ అవులెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న జాతీయ మత్స్య దినోత్సవం కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రత్యేక్ష ప్రసారం ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాకు చెందిన మత్స్యకారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన 7 మండలాల పరిధిలో కృష్ణానది పరీవాహక ప్రాంతం ఉందన్నారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్‌లో సుమారు 1400 మంది లైసెన్స్ కలిగిన మత్స్యకారులు చేపలను వేటాడటం జరుగుతుందన్నారు. 85 మత్స్య సహకార సంఘాల ద్వారా 4,326 మంది సభ్యులు జీవనోపాధిని పొందుతున్నారన్నారు. మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యాం కల్పించి మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఫిష్ రిటైల్ అవులెట్లు, ఫిష్ రిటైల్ మార్కెటింగ్ హబ్‌లు, ఫిష్ కియోష్కా, ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్ త్రీ వీలర్ మోటర్ సైకిళ్ళ పంపిణీ, లైవ్‌ఫిష్ అమ్మక కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలకు సబ్బిడీ పై ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. 20 లక్షలతో ఇన్స్‌లేటడ్ వాహనాల ఏర్పాటుకు, ఐస్‌బాక్సులతో కూడిన టూవీలర్ మోటర్ సైకిళ్ళ కొరకు, త్రీ వీలర్ మోటర్ సైకిళ్ళ కొరకు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి అర్హులైన ధరఖాస్తును అమోదించిన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. షిష్ ఆంధ్ర కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న మత్స్య సంపదను పెంచేలా మత్స్యకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ నగరంలో లైఫ్ ఫిష్ అమ్మకాలపై ప్రజలు మక్కువ చూపుతున్నారన్నారు. కొనుగోలుదార్లను ఆకర్షించేలా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించడం ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.జిల్లాలో 50 సంవత్సరాలు దాటిన 1,262 మంది మత్స్యకారులకు నెలకు 2,500 రూపాలయలు పెన్షన్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది కృష్ణానదిలో 15 లక్షల చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. వేట నిషేద భృతి కింద జిల్లాలో 409 మంది మత్స్యకారులకు ఒక్కక్కొరికి 10 వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. చేపల వేట చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంకు చెందిన పి. వీర్రాజు, కృష్ణలంకకు చెందిన టి. వాసులకు మత్స్యకార భీమా పథకం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో అక్వా సాగు చేస్తున్న 20 మంది రైతులకు విద్యుత్ సబ్బిడీ సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ, జిల్లా మత్స్య శాఖ అధికారి ఏ నాగరాజా, పియంఎస్ లంకె గోవిందరాజులు, ఏడి సిహెచ్ చక్రాణి, ఎఫ్‌డివోలు పి అఖిల, బి లెనిన్‌బాబు, వివిధ మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు మత్స్యకారులు పాల్గొన్నారు.