Breaking News

ని-క్షయ్‌ మిత్రల ద్వారా క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షయ వ్యాధిని సమూలంగా నివారించి క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.
ప్రధాన మంత్రి టిబి ముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణ కొరకు నిర్వహిస్తున్న ని-క్షయ్‌ మిత్రల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, టిబి కంట్రోల్‌ అధికారులు, ఇండియ రెడ్‌క్రాస్‌ సోసైటీ వివిధ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. ప్రధాన మంత్రి టిబి ముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణ కొరకు ని-క్షయ్‌ మిత్రలను ఏర్పాటు చేయనున్నారన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్‌ వ్యాధి వలన ప్రజలలో రోగనిరోదక శక్తి తగడం వలన టిబి కేసులు బయటపడుతున్నాయన్నారు. క్షయ వ్యాధిని సమూలంగా నివారించాల్సిన భాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ని-క్షయ్‌ మిత్రలు వారిని దత్తత తీసుకుని ఆరోగ్యవంతమైన పౌష్టికహారాన్ని అందించినట్లయితే వ్యాధిని రూపుమాపేందుకు అవకాశం వుంటుందన్నారు. స్వచ్చంద సంస్థలు క్షయ వ్యాధిగ్రస్తులకు సేవలందించి వ్యాధి నివారణలో భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రతి స్వచ్చంద సంస్థ తప్పనిసరిగా క్షయ వ్యాధిగస్త్రులను దత్తత తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2 వేల మంది క్షయ వ్యాధి బారిన పడినట్లు వైద్య అధికారుల నివేధికాలు తెలియజేస్తున్నారన్నారు. అయితే క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింత ఉండే అవకాశం వుందన్నారు. క్షయ వ్యాధి నివారణ మందులను కొనుగోలు చేసే వ్యాధిగ్రస్తుల వివరాలను మందుల షాపు యజమానులు తప్పనిసరిగా స్థానిక వైద్యాధికారులకు తెలియజేయవలసిన భాధ్యత ఉందన్నారు. క్షయ వ్యాధి నివారణ మందులను విక్రయించే వ్యాధిగ్రస్తుల వివరాలను తెలియజేయని మందుల షాపులపై చర్యలు తీసుకోవాలన్నారు. మందుల షాపుల నుండి సేకరించిన వివరాలతో వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లి వారికి పౌష్టికాహారం, మందులను సరఫరా చేసి సాధ్యమైనంతవరకు వ్యాధి నుండి విముక్తిని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వైద్య అధికారులను ఆదేశించారు.
క్షయ వ్యాధిగ్రస్తుడుని దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు: ప్రధాన మంత్రి టిబి ముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణ కొరకు నిర్వహిస్తున్న ని-క్షయ్‌ మిత్రల ఏర్పాటులో తొలి ని-క్షయ్‌గా ఒక క్షయ వ్యాధి గ్రస్తుడుని దత్తత తీసుకునట్లు జిల్లా కలెక్టర్‌ సమావేశంలో ప్రకటించి అధికారులకు స్పూర్తిదాయకంగా నిలించారు. తాను దత్తత తీసుకున్న వ్యాధిగ్రస్తుడుకి పౌష్టికాహరం, మందులను అందించి పూర్తిగా వ్యాధి నయం అయ్యేవరకు భాధ్యతలను తాను స్వీకరిస్తానని ఆయన తెలిపారు.
జిల్లా అధికారులు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవాలని:
జిల్లా అధికారి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ని-క్షయులై కనీసం ఒక క్షయ వ్యాధిగ్రస్తుని దత్తత తీసుకుని ఆరు నెలల పాటు వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. దత్తత తీసుకున్న క్షయ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి మాట్లాడి వ్యాధి, నివారణ మార్గాల గురించి తెలియజేయడంతో పాటు మానసిక ధైర్యన్ని పెంచినట్లయితే వ్యాధిగ్రస్తులకు వీలైనంత త్వరలో వ్యాధి నుండి విముక్తి కల్పించినవారమవుతామన్నారు. ప్రత్యక్షంగా వ్యాధిగ్రస్తులకు సహకారం అందించలేనివారు నెలకు 700 రూపాలయలు ఆర్థిక సహాయం అందించి పరోక్ష సేవలలో పాలుపంచుకోవాలని కలెక్టర్‌ కోరారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం సుహాసిని, జిల్లా టిబి కంట్రోల్‌ అధికారి డా. ఉషారాణి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షులు డా. జి సమరం, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు ఎస్‌. రామలక్ష్మి , ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పి.డి జె. సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *