Breaking News

మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారికి 34 వేల 310 జరిమానా…

-కక్షిదారులకు కౌన్సిలింగ్ ను నిర్వహించిన న్యాయమూర్తి యు. రామ్మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

నగరంలో పందులను నివారించేందుకు కమీషనర్‌ గారి ఆదేశాల మేరకు పందుల పెంపకం దారులపై కుడా మొబైల్‌ కోర్టులో ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసి జరిమానాలు విధించడం ప్రారంభించమన్నారు. ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్ ఈ రోజు సర్కిల్-1 కార్యాలయంలో మొబైల్ కోర్టును నిర్వహించినారు. సర్కిల్-1 కు సంబందించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై 54 కేసులు నమోదు చేసి వారిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. వీటిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా పశువులను రోడ్ల పైకి వదిలివెయ్యడం, రోడ్ల పైన చెత్త వేయడం నేరాల క్రింద వారికి న్యాయమూర్తి రూ. 34 వేల 310 జరిమానాను విధించారు. మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి వారికి కౌన్సిలింగ్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, కూడా ప్రతిరోజు ఆయా డివిజన్లలో ప్లాస్టిక్ అమ్మే షాపులను తనిఖీ చేసి అందరు విధిగా ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయవలసినదిగా అదేశిచినారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ -1 కె.టి. సుధాకర్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *