విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సభలో మహిళలకు ఘోరమైన అవమానం జరిగిందని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.కె.ఆషా అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.కె.ఆషా మాట్లాడుతూ నిన్న నరసాపురంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి అవమానం మహిళలకు జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభా ప్రాంగణంలో వెళ్లాలంటే ముస్లిం మహిళలు నల్ల రంగు బురఖాలు తీసివేయాలని అలాగే ముస్లిమేతర మహిళలు కప్పుకున్న నల్ల చున్నీలను తీసివేయాలని అధికారులు హుకుం జారీ చేయడం జరిగిందన్నారు. ఇది బిజెపి కనుసన్నల్లో జరుగుతున్న చర్యలాగా బిజెపి కను సన్నల్లో ముఖ్యమంత్రి మరియు అధికారులు నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుందన్నారు. 151 సీట్లు గెలుచుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నల్ల వస్తువులతో భయపడి సభలో నిరసన తెలుపటానికి చున్నీలు ఎక్కడ వాడుతారో అని భయంతో ముస్లిం మహిళలు పవిత్రంగా భావించి తన శరీరాన్ని కప్పుకునే వస్త్రం బురఖా, అలాగే హిందూ మహిళలు తన శరీరాన్ని కప్పుకునే వస్తువు చున్నీ ఇటువంటి బురఖా చున్నీ తీసి బహిరంగ సభ ప్రాంగణంలోకి రావాలన్న నిబంధన పెట్టడం క్షమించరాని నేరమన్నారు. ఇటువంటి నేరానికి పాల్పడ్డ అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలి అలాగే ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సమావేశంలో విజయవాడ తెలుగు మహిళ నాయకురాలు షేక్ గౌసియా, నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …