Breaking News

ఇంటర్నల్ కంప్లియెంట్ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలపై జరిగే వేధింపులు, లైంగిక దాడుల నుండి రక్షణ పొందే విధంగా ఇంటర్నల్ కంప్లియెంట్ కమిటీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు.
కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 లో భాగంగా జిల్లా స్థాయి కొర్ కమిటీ సమావేశం కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమం, పోలీస్, స్వచ్చంధ సంస్థలు, సైకాలజిస్ట్, అడ్వకేట్ లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట ప్రకారం అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేసి మహిళలపై లైంగిక వేధింపులు , హత్యాచారాలనుండి రక్షించ వలసి ఉందన్నారు. దీనిలో భాగముగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం చే గుర్తించబడిన, గుర్తించబడని సంస్థలలో అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీ ( ఇంటర్నల్ కంప్లియెంట్ కమిటీలు) ని ఏర్పాటు చేయాలని మహిళాభివృద్ది, శిశు సంక్షేమం శాఖ అధికారులను ఆదేశించారు. అంతర్గత, స్థానిక ఫిర్యాదుల కమిటీ నిరంతరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు , పాఠశాలల్లో అంబాసిడర్లను నియమించి సమస్యలు ఎదురైతే తక్షణమే ఆన్లైన్ లో పిర్యాదు చేసే విధంగా నెల రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో సైకాలజిస్ట్ లను కౌన్సిలర్లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమాజంలో మహిళలు నిత్యం అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని ముఖ్యంగా వారు ఎవరికి పిర్యాదు చేయాలనే దానిపై అవగాహనా లేకపోవడం గుర్తించడం జరిగిందన్నారు. ప్రతి కాళాశాలల్లోను రిసోర్స్ సెంటర్ లు,కంప్లియెంట్ బాక్స్ ఏర్పాటు చేయడం వల్ల వేధింపులకు పాల్పడే వారిలో భయంకలుగుతుందన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వేధింపుల నుండి రక్షణ పొందే విధంగానూ చట్టాలపై అవగాహనా కల్పించాలన్నారు. కేర్ సెంటర్స్ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. సమావేశంలో నిర్ణయాల అమలును సమీక్షించే విధంగా 15 రోజుల్లో తిరిగి కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ నుపుర్ అజయ్, డిసిపి వెంకట రత్నం, దిశా ఏసీపీ వివి నాయుడు, ఐసీడీస్ పిడి జి.ఉమాదేవి, మార్పు ట్రస్ట్ చైర్మన్ ఆర్. సూయజ్ , ఐసీడీస్ రిటైర్ పిడి కే.కృష్ణ కుమారి , హైకోర్టు అడ్వకేట్ డి.అనుపమ , కేబిన్ కాలేజీ సైకాలజిస్ట్ , కళ్యాణి రెడ్డి, సైకాలజిస్ట్ టి.కృష్ణ కుమారి, దిశా ఇన్ స్పెక్టర్ కే.వాసవి, మెర్రిస్ స్టెల్లా, కేబిన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *