Breaking News

రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోండి..

-సున్నవడ్డీ రుణాలపై రైతులకు అవగాహన కల్పించండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ పంటలలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞనాన్ని అనుసరించి రైతులు తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సున్న వడ్డీ పంట రుణాలను సద్వినియోగం చేసుకునేలా రైతాంగాన్ని చైతన్యవంతులు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 15 వేల 446 మంది రైతులు సున్నవడ్డీ పంట రుణాలు తీసుకోవడం జరిగిందన్నారు. రబీ సీజన్‌లో 8,440 మంది రైతులకు 2 కోట్ల 16 లక్షలు ఖరీఫ్‌ సీజన్‌లో 7006 మంది రైతులకు 1కోటి 83 లక్షలు కలిపి 3.99 కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీరూపంలో విడుదల చేయడం జరిగిందన్నారు. ఒక లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతు రుణం తీసుకున్న నాటి నుండి సంవత్సరానికి ఒక రోజు ముందుగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం పూర్తి వడ్డీ రాయితీని కల్పిస్తుందన్నారు. దీనితో పాటు మరో 30 లక్షల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్బిడీని నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతులు చేపట్టిన పంటకు ఎటువంటి పరిస్థితులోనైన నష్టం వటిలితే పంటల బీమా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు ఇ`క్రాప్‌ విధానాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న మినుము, పెసర, మొక్కజొన్న, పత్తి, చెరుకు వంటి పంటలకు 19.68 కోట్ల రూపాయలను 259 మంది రైతులకు నష్టపరిహారం కింద అందజేయడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో అత్యధిక శాతం మెట్టప్రాంతమైనందున రైతులు మిర్చి పంటనుఎక్కువగాచేపడతారన్నారు. రైతులు చేపట్టిన పంటలకు పంటల భీమా ద్వారా ఏ దశలో నష్టాపోతే ఎంత పరిహారం అందిస్తారనే విషయాలపై భీమా పాలసీ పై రైతులలో అవగాహన కల్పించేందుకు సమగ్ర సమాచారంతో కూడిన కరపత్రాలను ముద్రించి గ్రామాలలో పంపీణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ వంటి ద్రావణాలను గ్రామాలలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తద్వారా వాటిని రైతులు పెంటపోగులపై పిచికారి చేసి కుళ్లించడం ద్వారా మేలుకరమైన బ్యాక్టిరియా తయారి అయి పంట పొలాలలకు మంచి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం మిరప పంటను ఆశించే నల్ల తామర పురుగు సమగ్ర యాజమాన్య పద్థతుపై ఉద్యాన శాఖ రూపొంధించిన బుక్‌లెట్‌ను, వాల్‌ పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విడుదల చేశారు.సమావేశంలో అగ్రి కల్చర్‌ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ డి. దామోదరరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం. విజయభారతి, ఉద్యాన శాఖ అధికారి ఏడి బాలజీకుమార్‌, పశు సంవర్థక శాఖ అధికారి కె. విద్యా సాగర్‌, ఏపియంఐపి పిడి సుభాని, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎస్‌ సత్యనారాయణ, మార్క్‌ఫడ్‌ జిల్లా మేనేజర్‌ నాగ మల్లిక, సలహా మండలి సభ్యులు కాజ బ్రహ్మయ్య, షేక్‌ నాగుల మీరా, వ్యవసాయ అధికారులు డి వెంకటేశ్వరరావు, డి. రమణ మూర్తి, యం.రత్నశ్రీ, శశికళ, యం స్వప్న తదితరులు ఉన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *