Breaking News

హింసను అరికట్టేందుకు స్త్రీలను గౌరవించడమే ప్రధానం…

-మహిళాలలో హింసను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఉండాలి…
-మహిళా హింసను అరికట్టడంలో భాగస్వామ్యులౌదాం…
-జిల్లాకలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మానవ సృష్టికి మూలమైన మహిళాలను గౌరవించడం ద్వారానే హింసను అరికట్టేందుకు అవకాశం వుంటుందని తల్లి, చెల్లి, భార్య స్థానాలకు ప్రతిరూపమైన స్త్రీని కుటుంబ వ్యవస్థలో పవిత్రమైన స్థానంతో ఆరాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్త్రీ లేనిదే జననం, గమనం, జీవం లేదని స్త్రీ లేకపోతే సృష్టే లేదని అంత గొప్ప విలువ ఉన్న స్త్రీ మూర్తిని గౌరవించుకోవాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. తల్లిగా లాలిస్తు, చెల్లిగా తోడుంటూ, భార్యగా సహజీవనం చేస్తూ దాసిలాగా సేవలందించే స్త్రీ మూర్తికి గౌరవప్రదమైన స్థానం ఇచ్చి పవిత్రతతో ఆధారించినప్పుడు మహిళాలపై హింసకు తావు ఉండదన్నారు. సమాజంలో మహిళాల రక్షణ కోరకు ప్రభుత్వం అనేక చట్టలను తీసుకువచ్చినప్పటికి మహిళాలపై కొన్ని లైంగిక వేధిపులు, ఆత్యాచారలు వంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. మహిళా హింస నివారణ పై మహిళాలతో కంటే పురుషులతో అవగాహన సదస్సును నిర్వహిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నానన్నారు. స్త్రీ విలువ ఆమె పట్ల అనుసరించాల్సిన ప్రవర్తన మహిళా పై శారీరక, మానసిక, లైంగిక హింసలకు పాల్పడిన వారికి చట్టాల ద్వారా తీసుకునే కఠిన చర్యలు వివరిస్తే హింసలను అరికట్టేందుకు అవకాశం వుంటుందన్నారు. సమాజంలో ధనమే అన్నిటికి మూలంగా భావిస్తూ మానవ సంబంధలను సైతం లెక్కచేయడకుండా అసాంఫీుక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళాల ఆర్థిక సాధికారిత, బాల్య వివాహల నిర్మూలన, మహిళా చట్టాలు హక్కులపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా ఏ మహిళాయితే హింసను ఎదుర్కొంటున్నారో నిర్భయంగా ముందుకు వచ్చి మహిళాల రక్షణకు నిర్థేశించిన చైల్డ్‌ లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌181, పోలీస్‌ 100/112, వంటి హెల్ప్‌ లైన్‌లకు సంప్రదించడం ద్వారా రక్షణ పొందాలన్నారు. మహిళాలపై అఘయిత్యాలను నివారించేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ప్రవేశ పెట్టి మహిళాలకు రక్షణగా వుంటున్నారన్నారు. మహిళాల నుండి అందిన ఫిర్యాధులను తక్షణమే విచారించి సంఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. మహిళాల హింసకు సంబంధించిన కేసులను సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రక్రియను పూర్తి చేసి నింధితులపై చట్టాప్రకారం చర్యలు తీసుకుంటే కొంత మేరా మహిళా హింసలను నివారించగలుగుతామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానవ హరంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ నేను సైతం నాదేశ మహిళాలు బాలికలపై జరుగుతున్న హింస దోపిడి అత్యాచారాలు లైంగిక వేదింóపులను వ్యతిరేకిస్తానని మహిళా హక్కుల పరిరక్షణ సాధికరతకు భరోసాగా వుంటానని ఆత్మసాక్షిగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు, అవుతూ శైలజరెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేటర్లు చైతన్యరెడ్డి, యం రత్నకుమారి, జి. గోదావరి, మాధురి లావణ్య, ఏ విజయలక్ష్మి, ఐసిడిఎస్‌ పిడి ఉమాదేవి, దిశ ఎస్‌ఐ పూర్ణిమ, సిడబ్ల్యుసి చైర్‌ పర్సన్‌ సువార్త, మానసిక వైద్య నిపుణులు కల్యాణి రెడ్డి, కృష్ణకుమారి, సిడిపివోలు జి మంగమ్మ, జి. గ్లోరి, యం. లలిత, లక్ష్మి బార్గవి, రేణుక, నాగమణి, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *