-స్పందన కార్యక్రమం ద్వారా అధికారులు తక్షణమే స్పందించాలి…
-స్పందనలో 98 అర్జీలు నమోదు…
-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజల నుండి స్వీకరించే ఆర్జీలను సావదానంగా విని పరిష్కరించినప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీ దారులనుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో స్పందనను ఆశ్రయిస్తారన్నారు. అధికారులు ఆర్జీదారుడు ఇచ్చిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. వినతులపై సంబంధిత శాఖల అధికారులు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి పరిష్కరించిననాడే స్పందన లక్ష్యం నేరవేరుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తూన్నాయని, అర్జీదారులు కూడా తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. న్యాయ స్థానాలు రెవెన్యూ కోర్టుల పరిధిలోని అర్జీలను ఏవిధంగా పరిష్కారించాలనే దానిపై ఆలోచన చేయాలన్నారు. నిర్థేశించిన గడువులోగా పరిష్కరించవలసిన అర్జీలను పెండిరగ్ లేకుండా పరిష్కారం చూపాలన్నారు. సచివాలయం, మండల, డివిజన్ స్థాయిలోనే అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
స్పందనలో 98 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 27, పోలీస్ 23, గ్రామ వార్డు సచివాలయాలకు 7, విద్య 5, యంఎయుడి 4, వైద్య, వ్యవసాయం, డిజెబుల్డ్, బిసి వెల్ఫెర్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయిమెంట్ శాఖలకు మూడేసి అర్జీల చొప్పున రాగా, డ్వామా 2, డిఆర్ డిఏ 2, సర్వే అండ్ సెటిమెంట్ 2, పంచాయతీరాజ్ 2, సహకార శాఖ 2, పౌరసరఫరాలు, దేవదాయ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ నమోదయ్యాయన్నారు. తన పరిధిలోని వాటిని కలెక్టరు తక్షణమే పరిష్కరించగా కొన్నింటిని విచారించి పరిశీలించాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, అసిస్టెంట్ డిప్యూటి కలెక్టర్లు ఎస్.రామలక్ష్మి, ఖతీఫ్ కౌసర్ బానో, డ్వామా పీడి జె సునీత, డీఈవో సీివీ రేణుక, ఐసీడీఎస్ పీిడి యం.ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి కె. అనురాధ, డీఎస్‌వో పి.కోమలి పద్మ, హౌసింగ్ పీడి శ్రీదేవి, బిసి వెల్ఫెర్ ఆఫీసర్ సిహెచ్ లక్ష్మి దుర్గ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.