విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం విజయవాడ నగర వైయస్సార్సీపి ఎస్సి విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సమావేశ కార్యక్రమం నిర్వహించి అర్పించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి అణగారిన వర్గాలకు రాజ్యాధికారం పొందాలని సూచించారన్నారు గత పాలకులు ముఖ్యంగా టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసి అణిచివేయటమే లక్ష్యంగా ముందుకు సాగారన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశించిన విధంగా ఎస్సీ ఎస్టీల లకు అధిక ప్రాధాన్య వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగటమే కాకుండా ఆ వర్గాలకు రాజకీయ పదవుల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా పాలన ఉంటుందని ప్రతి ఒక్కరు ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ రూహుల్ల మాట్లాడుతూ నగరంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ స్టేజి రాష్ట్రానికే తలమానికంగా నిలవబోతుందన్నారు గత టిడిపి ప్రభుత్వం దళితులను అనగదొక్కటమే లక్ష్యంగా పనిచేసే వారి వారి సామాజిక వర్గాలకు అండగా నిలిచారన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్య తీస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు రు నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మతాలకతీతంగా పాలన కొనసాగిస్తున్నారని ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి అండగా ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు రానున్న కాలంలో జగన్ ప్రతి ఒక్కరు అండగా నిలిచి ఇతర పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు ఈ సభలో విజయవాడ నగర వైసిపి ఎస్సి విభాగ అధ్యక్షులు బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ఎస్సీ కమిషన్ సభ్యులు కాలె పుల్లారావు వైఎస్ఆర్సిపి ఎస్సి నాయకులు మేదర సురేష్‌కుమార్, కండెల డేవిడ్, కంపాల అంబేద్కర్, పూనూరి సతీష్, పరసా కృష్ణ లీల పూడి లాజర్, పొలిమెట్ల శరత్ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …