విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భూ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, అడిషనల్ సెక్రటర్ ఎయండి ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీ గణేష్‌లు వైయస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో జిల్లాలోని 14 గ్రామాలలో భూముల రీసర్వే పనులు పూర్తి చేసి భూ హక్కు పత్రాల ముద్రణ, పంపిణీ ప్రారంభించామన్నారు. సర్వే పూర్తి అయిన గ్రామాలలో రెవెన్యూ రికార్డులలోని వివరాలను క్షేత్రస్థాయి సర్వే వివరాలతో సరి చూసి భవిష్యత్‌లో భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు, వివాధాలకు తావులేకుండా శాశ్వత ప్రతిపాదికన భూ హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని తిరువూరు మండలంలోని ఆంజనేయపురం, ఏకొండూరు మండలంలోని మారేపల్లి గ్రామాలలో భూ హక్కు పత్రాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాలలో కూడా భూ హక్కు పత్రాల పంపిణీకి సిద్దం చేస్తున్నామని కలెక్టర్ డిల్లీరావు సిసిఎల్‌ఏ సాయిప్రసాద్‌కు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్‌కుమార్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికాడ్స్ ఆఫీసర్ కె. సూర్యారావు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …