రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పురోగతిలో ఉన్న 66 జల్ జీవన్ మిషన్ , 74 సామాజిక టాయ్ లెట్స్ పనులను డిసెంబర్ 31 నాటికి పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ డబల్యు ఎస్ ఎస్ ఈ .. డి. బాల శంకర్ రావుతో కలిసి డివిజన్, మండల స్థాయి అధికారులతో సామూహిక మరుగు దొడ్లు, జల్ జీవన్ మిషన్, జిజిఎంపి లపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జల జీవన్ మిషన్ కింద 493 పనుల్లో 413 ప్రారంభం అవ్వగా వాటిలో 159 పూర్తి అయి, 66 ప్రగతి లో ఉన్నాయనీ వాటిని పూర్తి చేయాలన్నారు. ఇంకా ప్రారంభం కానీ 57 పనుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాజిక మరుగు దొడ్లు లో 392 పనులకు 216 పూర్తి అవ్వగా, 74 పురోగతి లో ఉన్నాయని వాటిని 20 రోజుల్లో పూర్తి చేసి, ప్రారంభం కావలసిన వాటిని డిసెంబర్ 31 కి గ్రౌండింగ్ చెయ్యాలని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా 387 పనులలో 382 పనులకు రూ.12 . 74 కోట్ల మేర పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని, వెంటనే ఆపనులు ప్రారంభించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …