Breaking News

పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో విజయవాడలో అతిపెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శన

-డిసెంబర్ 17 నుండి 24వ తేదీ వరకు జరిగే 8 రోజుల అద్భుత ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దక్షిణ భారతదేశంలో అత్యంత ఇష్టపడే ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెల్స్ నేడిక్కడ విజయవాడలోని తమ స్టోర్‌లో బ్రైడల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లాపరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్దెఅనురాధ, సమాన మూసావి మేనేజింగ్ పార్టనర్ & సిఇఒ సమానా ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైన్ స్టడీస్ గౌరవ అతిథిగా హాజరై, ప్రదర్శనను ప్రారంభించారు. పీఎంజే జ్యువెల్స్ విజయవాడ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ విఠాలతో  పాటు, విజయవాడ నగరంలోని ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండుగ సీజన్‌లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌  ప్రారంభోత్సవానికి నగరంలోని ప్రముఖులు  పలువురు హాజరయ్యారు.

17వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ కమ్ సేల్ డిసెంబరు 24 వరకు కొనసాగుతుంది. 10,000+ హ్యాండ్‌క్రాఫ్ట్ క్రియేషన్స్‌ తో ప్రత్యేకంగా విజయవాడలో జరిగే వివాహ ఆభరణాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యుత్తమ & మునుపెన్నడూ చూడని డిజైనర్ జ్యువెలరీ శ్రేణిని పీఎంజే ప్రదర్శిస్తోంది. వివాహ ఆభరణాలతో పాటు డైలీ వేర్, ఫెస్టివ్  క్రియేషన్స్, ఆఫీస్ వేర్, పార్టీ ఆభరణాలు, రెగ్యులర్ వేర్ డిజైన్‌లు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించ బడతాయి.

ప్రత్యేకంగా క్యూరేటెడ్ చేయబడిన, విలాసవంతమైన, విలక్షణమైన, మిరుమిట్లు గొలిపే, సొగసైన కాలాతీత డిజైన్‌లు సంప్రదాయ రకాలతో లభ్యమవుతున్నాయి. తాజా, ఫ్యాషన్ డిజైన్‌లతో కూడిన డైమండ్ బ్రైడల్ ఆభరణాలు ఆభర ణాల ప్రియులను మంత్రముగ్ధులను చేస్తాయి. వజ్రాలు, బంగారం, సాలిటైర్‌లలో విస్తృతమైన డిజైన్‌లతో, సంప్రదా యం నుండి ఆధునికం వరకు, ఆభరణాలకు సమకాలీన స్పర్శతో వివాహ, బ్రైడల్ ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గద్దెఅనురాధ మాట్లాడుతూ “విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వివాహ ఆభరణాల ప్రదర్శనను నిర్వహించడం నిజంగా ఒక అదృష్టం. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నందున, విస్తృత శ్రేణి డి జైన్ల నుండి తమకు కావాల్సిన ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే ఆభరణాల ప్రియులకు ఈ ఎగ్జిబిషన్ కచ్చితంగా ఒక గొప్ప అవకాశం. 10,000+ కంటే ఎక్కువ డిజైన్‌లతో కూడిన అద్భుతమైన ప్రదర్శనను నిర్వహి స్తున్నందుకు పీఎంజే యావత్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఇదెంతో ప్రశంసనీయం. ఆభరణాల ప్రియు లందరినీ ఎగ్జిబిషన్‌ని సందర్శించి జీవితకాల అనుభవాన్ని పొందాలని నేను కోరుతున్నాను” అని అన్నారు.

ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎంజే జ్యువెల్స్ విజయవాడ డైరెక్టర్ రామకృష్ణ విఠాల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయవాడలోని మా ఎగ్జిబిషన్‌లో ఇంతటి విస్తృత స్థాయి లో ఆభరణాల కలెక్షన్ ను అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వధువులు, తోడిపెళ్లికూతురు, బంధు వులు, అందరూ ఈ ప్రదర్శనను సందర్శించాలి. మా డిజైన్లన్నీ సంప్రదాయం, ఆధునికత మేలుకలయికగా అత్యం త శ్రద్ధాసక్తులు, అభిరుచితో రూపొందించబడ్డాయి. మా స్టోర్‌ని తప్పకుండా సందర్శించి, మా ఎగ్జిబిషన్‌లో అత్యుత్త మ నాణ్యమైన డిజైన్‌లను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు విజయవాడలోని ఆభరణాల ప్రియులం దరినీ మేం ఆహ్వానిస్తున్నాం. సందర్శకులు ఒక గొప్ప అనుభూతిని పొందుతారు,  విలాసవంతమైన శ్రేణి నుండి తమకు కావా ల్సిన ఆభరణాలను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు’’ అని అన్నారు.

పీఎంజే అనేది వ్యాపారంలో కొత్త ప్రమాణాలను సృష్టించడం కోసం పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో ఆభరణాల కొనుగోలులో ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. చేతితో తయారు చేసిన ఆభరణాల కళను ప్రోత్సహిస్తుంది. ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,  ఇంతకుముందెన్నడూ  చూడని హస్తకళాకృతులను కొనుగోలు చే యాల్సిందిగా ఎగ్జిబిషన్ నిర్వాహ కులు ఆభరణాల ప్రేమికులను ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *