-జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డా.ఐ.కరుణ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి11, 2023 న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డా.ఐ.కరుణ కుమార్ తెలిపారు. శనివారం మండల న్యాయ సేవ అధికార సంస్థ ప్రతినిధులతో , అధికారులతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ మరియు ఎ.పి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అమరావతి వారి ఆద్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ 11 ఫిబ్రవరి 2023 వ తేది జరగనున్నదని ఈ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా వారి న్యాయపరమైన కేసులను పరిష్కరించు కోవడానికి కక్షిదారులకు మంచి అవకాశమని తెలిపారు.
కోర్టుకు వెళ్లే ముందు జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ, మండల న్యాయ సేవ అధికార సంస్థలు వద్దకు వెళ్లి ప్రీలిటికేషన్ సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. వివిధ క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,ఎన్ ఐ చట్టం u/s 138 కేసులు, మనీ రికవరీ కేసులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్లు, కార్మిక వివాదాలు, విద్యుత్ & నీటి బిల్లు వంటి పబ్లిక్ యుటిలిటీ సేవలకు సంబంధించిన వివాదాల కేసులు మొదలైనవి, (కాంపౌండేషన్ కాకుండా),
భూసేకరణ కేసులు, సర్వీస్ పెన్షన్ సేవలు, రెవెన్యూ కేసులు, హైకోర్టు మరియు జిల్లా కోర్టుల మధ్య పెండింగ్‌లో ఉన్నవి మరియు ఇతర సివిల్ ఫ్రంట్, ఇంజక్షన్ సూట్లు తదితర కేసులను పరిష్కరించుకొనుటకు ఇది మంచి అవకాశం అని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, అంతే కాకుండా ఇద్దరి మధ్య స్నేహపూర్వం కలుగుతుందని కావున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News