రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు లోని శ్రీ సుందర సాయి నిగమగమ కళ్యాణ మండపం లో డిసెంబర్ 20, 21 తేదీల్లో మంగళ, బుధవారం లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, కంటి పరిక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 20 న మంగళవారం ఉచిత మెగా వైద్య శిభిరం, డిసెంబర్ 21 బుధవారం కంటి వైద్య పరీక్షలు , రక్త దాన శిబిరం మరియు వృద్దులకు పండ్లు వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కొవ్వూరు నియోజక వర్గం లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తానేటి వనిత కోరారు. మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో పెద్ద ఎత్తున యువత, నియోజక వర్గ ప్రజలు, మహిళలు, వృద్దులు, కార్యకర్తలు నాయకులు కలిసి వచ్చి విజయవంతం చేయాలన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …