-ఎన్జీఓస్ నేత రాజుబాబును సన్మానించిన డీటీసీ యం పురేంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్జీవోఓ అసోసియేషన్ పశ్చిమకృష్ణ శాఖకు జిల్లా ఉపాధ్యక్షుడిగా యం రాజుబాబు ఎన్నికవ్వడం అభినందనీయమని, ఉద్యోగుల పక్షన చేపట్టే కార్యక్రమాలతోపాటు, ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు కూడా అభినందనీయమని రాజుబాబు ను డీటీసీ యం పురేంద్ర అభినందించారు. స్థానిక బందరు రోడ్డు డీటీసీ కార్యాలయంలో సోమవారం నాడు ఏపీ ఎన్జీఓస్ సంఘం జిల్లా శాఖకు ఉపాధ్యక్షుడిగా రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబు ఎన్నికైన సందర్భంగా డీటీసీ కార్యాలయంలో అధికారులు ఉద్యోగులు రాజుబాబును ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డీటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ రాజుబాబు రవాణాశాఖ ఉద్యోగుల సంఘానికి జోనల్ అధ్యక్షుడిగా ఉంటూ ఏపీ ఎన్జీవోస్ లో కూడా ఎన్నికవ్వడం గర్వించతగ్గ విషయమని, రవాణాశాఖ ఉద్యోగుల సంఘంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం శ్రమించేవాడని, ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి, వాటిని పరిష్కరించే వరకు వదిలిపెట్టేవాడు కాదని రాజుబాబును కొనియాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న ఏపీ ఎన్జీవోఓ సంఘంలో రవాణాశాఖ నుండి జిల్లాలో మూడవసారి ఉపాధ్యక్షుడుగా రాజుబాబు ఎన్నికవ్వడం శాఖాపరంగా గర్విస్తున్నామన్నారు.
ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐ రఘుబాబు మాట్లాడుతూ రవాణాశాఖలోని ఉద్యోగులుగా సాధించుకోవలసినవి ఎన్నో ఉన్నాయని, వాటిని పరిష్కరించెదానిలో కొన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన పెండింగ్ అంశాలు కూడా ఉన్నాయని, అటువంటివాటిని ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర సంఘంను కలుపుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు. ఏపీ ఎన్జీవో సంఘంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజుబాబు ఎన్నికవ్వడం ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కోరుకుంటున్నామన్నారు.
రాజుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ నాయకత్వంలో ఉద్యోగుల పక్షాన శక్తివంచన లేకుండా పనిచేస్తానని, ఉద్యోగుల హక్కుల కొరకు డిమాండ్ల సాధనకొరకు చేపట్టే కార్యక్రమాలలో జిల్లా కార్యవర్గంతో పాల్గొని ఉద్యమిస్తామన్నారు. తనను ప్రోత్సహిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రాజుబాబు తెలిపారు. డీటీసీ యం పురేంద్ర, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ రఘుబాబు చేతులమీదగా రాజుబాబుకు గజమాలను వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవోస్ విజయవాడ నగరశాఖ అధ్యక్షుడు సిహెచ్ శ్రీరామ్ ను కార్యదర్శి కె సంపత్ కుమార్ ను వారి కార్యవర్గ సభ్యులను రవాణాశాఖ ఉద్యోగులు పూలమాలలను వేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరి సహాధ్యక్షుడు డి శ్రీనివాస్, కోశాధికారి యం ఆనంద్ కుమార్, సంఘం పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు జె రాజారావు, ఇన్స్పెక్టర్ యం నారాయణరాజు, ఏపీ ఎన్జీవోస్ విజయవాడ నగర అధ్యక్షులు సిహెచ్ శ్రీరామ్ కార్యదర్శి కె సంపత్ కుమార్ ఎన్జీవో నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News