Breaking News

పవర్ లిఫ్టర్ శ్రీనివాస రావు ని అభినందించిన ఎం.డి.ద్వారకా తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి ఇటు సంస్థకు అటు దేశానికీ ఎంతో ఖ్యాతి తీసుకొచ్చిన కాకినాడ డ్రైవర్ శ్రీనివాస రావుని సంస్థ ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ ఆర్టీసీ హౌస్ కి ప్రత్యేకంగా పిలిపించి సోమవారం  ఆర్టీసీ హౌస్ లోని మెయిన్ కాన్ఫరెన్సు హాల్ నందు శ్రీనివాస్ ని సత్కరించారు. ఆర్టీసీ పేరుని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసినందుకు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని అభిలషించారు. డ్రైవర్ గా ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తూనే తన లోని ప్రతిభకి కూడా గుర్తింపు వచ్చేలా కృషి చేయడం వెనుక ఎంతో కష్టం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సొంత ఖర్చులతో పోటీలకి సిద్ధపడి ఇన్ని అవార్డులు, బహుమతులు సంపాదించడం ఎంతో గర్వ కారణమని, భవిష్యత్తులో సంస్థ తరపున కావలసిన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ ఎం.డి.  ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఏ. కోటేశ్వరరావు(అడ్మిన్), కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి (ఆపరేషన్స్), కృష్ణ మోహన్(ఇంజినీరింగ్), విజయవాడ జోన్ ఈ.డి  గిడుగు వెంకటేశ్వరరావు, ఆర్టీసీ హౌస్ సిబ్బంది, ఎస్.సి. ఎస్.టి. ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *