-సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలను అంది పుచ్చుకోవాలి: డి ఆర్ ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు సుపరిపాలన అందించుట కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని డిఆర్ఓ యం.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. డియల్ డి ఓ సుశీల, సాంఘిక సంక్షేమ మరియ సాధికార అధికారి చెన్నయ్య, డీఈఓ శేఖర్, డిఆర్డీఏ పి డి జ్యోతి, స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారిణి జయలక్ష్మి లతో కలసి శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం హాల్ నందు నిర్వహించిన గుడ్ గవరనేన్స్ వారోత్సవ జిల్లా స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు,వలంటర్ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు. ఏ పి సర్వీసు సేవలు, సచివాలయం ద్వారా పలు రకాల సేవలు ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. సదరం, ఆధార్ అప్డేట్ చేయడం వంటి సేవలు అందజేయడం జరుగుతోందని, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించడం జరిగిందని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయని, ఇంకా అర్హులైన వారిని గుర్తించి అర్హులై ఉంటే వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతోంది అన్నారు. ప్రతి సోమవారం గ్రామ సచివాలయం, మండల స్థాయిలో,జిల్లా స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు అందజేసిన సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డియల్ డి ఓ సుశీల మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 25 వరకు గుడ్ గవర్నేన్స్ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ డి జి, స్పందన, ఏ పి సేవ సర్వీసులు ప్రాధాన్యత గా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్ డిజి, స్పందన, ఏపి సేవ సర్వీస్ లు అందజేయడలో రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు, గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో గర్భవతులు ఎంత మంది ఉన్నారని గుర్తించి, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని గుర్తించి వారికి ప్రభుత్వం అందించే వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్స్ అందజేయాలని తెలిపారు. 10 నుండి 19 సంవత్సరాల బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలు డ్రాప్ ఔట్ లేకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల లో ని 0 నుండి 3 సం. ల, 3 నుండి 5 సంవత్సరాల పిల్లలు వయసుకు తగ్గ బరువు ఉండేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, డిఆర్డీఏ పిడి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు వారి శాఖల ద్వారా ప్రజలకు అందించే సేవలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు,మహిళా పోలీసులు, విద్యా,వైద్య, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ జి ఓ లు తదితరులు పాల్గొన్నారు.