Breaking News

ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం చదవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలని హ్యూమన్ రైట్స్ ఆఫ్ గరుడవేగ సొసైటీ అధ్యక్షులు పి.అనిల్ కుమార్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచిన. దేశంలో నేటికీ 366 కులాలకు పైగా వెనుకబడి ఉన్నాయని, వారి స్థితిగతులు మెరుగుపడలేదని వివరించారు. వెనకబడి ఉన్న కులాల అభివృద్ధి సాధనకై హ్యూమన్ రైట్స్ గరుడవేగ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి వారి హక్కులను తెలియజేస్తూ వారిని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తామని అన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వారి మతాల ప్రకారం పవిత్ర గ్రంథాలు ఎలా అభ్యసిస్తారో అలానే ప్రతి ఒక్కరు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అభ్యసించాలని సూచించారు. ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా హ్యూమన్ రైట్స్ గరుడవేగ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ గరుడవేగా ఆఫ్ ద సొసైటీ ఉపాధ్యక్షులు ప్రభు సాయి, జనరల్ సెక్రెటరీ ఆంజనేయ కుమార్, జాయింట్ సెక్రెటరీ సీతారామమ్, ట్రెజరర్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *