Breaking News

బైజ్యుస్ ఒప్పందంతో పిల్లలకు అందుబాటులో ఉన్నత ప్రమాణాల సాంకేతిక విద్య.: ఎమ్మెల్యే భూమన

-ప్రతి పేద విద్యార్థి ముందుండాలనే సీఎం తపన: మేయర్
-దేశంలోనే విద్యార్థులకు మొదటగా ట్యాబ్ లను అందించిన ఘనత మన రాష్ట్రనిదే: కమిషనర్

తిరుపతి , నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీమంతుల పిల్లలు చదువుకొనే విద్యాసంస్థల ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద పిల్లలకు అందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే విద్యపై అనేక ప్రయోగాలు చేసిన బైజుస్ వారితో ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు ఒక బహుమతిగా అత్యంత విద్యా ప్రమాణాలు కలిగిన ట్యాబ్ లు అందిస్తున్నారని శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీ పండిత జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తిరుపతి నియోజకవర్గం లో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజుస్ ట్యాబ్ లను అందించే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొనగా, నగర పాలక మేయర్ శిరీష , కమిషనర్ అనుపమ అంజలి అతిథులుగా పాల్గొన్నారు.

తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విద్య తో పోటీ పడాలని ఒక వర ప్రసాదం లాగా ముఖ్యమంత్రి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక తో కూడిన విద్య గల పాఠ్యాంశాల ట్యాబ్ లను అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 1400 కోట్లు ఖర్చు చేసి 4, 56, 832 ట్యాబ్ లను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈనెల 28 లోపు అందించాలని నిర్ణయించారని అన్నారు. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 28 పాఠశాల పాఠశాలలలో చదువుతున్న 1856 మంది 8వ తరగతి విద్యార్థులకు 148 మంది ఉపాధ్యాయులకు 2004 ట్యాబ్ లను అందించనున్నామని అన్నారు. నేడు మీ దగ్గర ఉన్న నగరపాలక కమిషనర్ చిన్న వయసు కల వ్యక్తి, కానీ మా అందరి కన్నా పెద్ద స్థాయి ఐఏఎస్ ఉద్యోగస్తురాలని ఈ గౌరవం విద్యతోనే సాధ్యమైందని విద్యార్థులు గుర్తించాలని అన్నారు. విద్యా బోధన చేసేవారు , సాంకేతిక విద్యను అందించేవారు ఎంత గొప్ప వారైనా మీలో శ్రద్ధ, చదువుకోవాలని ధ్యాస ఉండాలని అపుడే ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. మీ తల్లిదండ్రుల కన్నా పెద్దవాడిగా , ఒక శాసనసభ్యుడిగా చదువు పట్ల శ్రద్ధ తప్ప వేరే ఆలోచనలకు, వ్యపకాలకు వెళ్లరాదని అన్నారు. ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసే విధంగా ప్రతిరోజు మీ పాఠ్యాంశాలను శ్రద్ధగా టాబ్ ల ద్వారా సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రతి ప్రశ్నకు సమాధానం అందించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. అలాగే అమ్మానాన్నలతో చూపించే ప్రేమ సమాజంలో చుట్టుపక్కల వారిపై కూడా కనీసం 50% చూపించే విధంగా మంచి నడవడిక మీలో రావాలని కోరుకుటున్నానని అన్నారు.

నగరపాలక మేయర్ మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యత తెలిసి, విద్య అనేది తరగని ఆస్తి అని నమ్మిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిఅని జాతీయస్థాయిలో ప్రతి పేద విద్యార్థి ముందు ఉండాలనే తపనతో అనేక పథకాలను విద్య కోసం అమలు చేస్తున్నారని అన్నారు. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలలలో వసతులు, విద్యా ప్రమాణాల కోసం సి బి ఎస్ సి సిలబస్ అమలు చేస్తున్నారని, నేడు మీరు అందుకుంటున్న బై జ్యుస్ ట్యాబ్ లతో సాంకేతికతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నామని అన్నారు.

నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని మొదటిసారిగా పాఠ్యాంశాలను సాంకేతిక జోడించి ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నది మన రాష్ట్రంలోనే అన్నారు. నేడు8వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్ 9, 10 తరగతు లకు ఉపయోగపడేలా మూడు సంవత్సరాల కాలం ఈ ట్యాబ్ ను ఉపయోగించుకుని విద్యార్థులు విజ్ఞానవంతులు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో బైజ్యుస్ ట్యాబ్ లను ప్రముఖులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు బసవ గీత, వెంకటేశ్వర్లు , జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ఎంఈఓ ప్రభాకర్ రాజు, నగరపాలక అడిషనల్ కమిషనర్ సునీత, నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మునిశేఖర్ రెడ్డి, వివిధ పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *