Breaking News

జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామం నందు మంగళవారం జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ కార్యక్రమంలో నందిగామ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ S నూపూర్ అజయ్, ఐఏఎస్, రెవిన్యూ డివిజనల్ అధికారి నందిగామ,A.రవీంద్ర రావు, ఎన్టీఆర్ జిల్లా అసిస్టంట్ డైరెక్టర్ సర్వే డిపార్టుమెంటు సూర్య రావు, డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రవీంద్ర ప్రసాద్ పాల్గొని వున్నారు.
కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో నిర్వహించిన జగనన్న శాశ్వత భూహక్కుకార్యక్రమం లో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ S నూపూర్ అజయ్, ఐఏఎస్ మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి నందిగామ, A.రవీంద్ర రావు కలిసిజగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ చేసియున్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ S నూపూర్ అజయ్, ఐఏఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రెవిన్యూ చరిత్రలో అమోఘ సంస్కరణకు చర్యలు తీసుకున్నారని, రాష్ట్రంలో ఉన్న రైతుల మరియు ప్రజల భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత భూహక్కు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి భూమిపై హక్కులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని,అందుకే రైతుల ప్రయోజనాల కోసం రీసర్వే భూములను నిర్ణయించారని, సుమారు 60 ఏళ్ల తర్వాత రీస‌ర్వే చేస్తున్నామని, రికార్డుల తప్పులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పులకు అవకాశం ఇవ్వకుండా రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ఈ కార్యక్రమము జరుగుతోందన్నారు. భూ రికార్డులు లేవనే సమస్య ఉండదని, ప్రజలందరి సౌకర్యార్థం కచ్చితమైన కొలతలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. సాదా బైనామా అగ్రిమెంట్లు ఉన్న భూములను అనుభవిస్తున్న రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు అందజేస్తారన్నారు. పరిటాల గ్రామంలో 2021 ఖాతాలకు రిసర్వే జరిగిందని సర్వేకు ముందు గ్రామంలో 6201.36 ఎకరాలు ఉండగా రి సర్వే తర్వాత హద్దులు నిర్ణయించి 6183.19 ఎకరాలుగా తేల్చారని, ఆ హక్కుదారులకు పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు .రీ సర్వేకు ముందు పరిటాల గ్రామములో 801 సర్వే నెంబర్లకు గాను 3039 LPM (ల్యాండ్ పార్సెల్ మ్యాప్)లు వచ్చి వున్నవి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యద్దనపూడి ఆనంద జోష్ణ , ఎంపీపీ మలక బషీర్ , జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్త రజిని శ్రీనివాస్, తహశీల్దార్ కంచికచర్ల వి.రాజకుమారి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *