మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులను తయారు చేయడమే ద్వేయంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. బుధవారం తపసిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కృష్ణాజిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేశారు. మచిలీపట్నం మండలం పరిధిలోని 38 అర్బన్, రూరల్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 1526 మంది విద్యార్థులకు బైజూస్ వారి కంటెంట్ తో కలిపి రూ.31 వేల విలువైన 1526 ట్యాబులను పంపిణీ చేశారు.
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని, క్రింది దశ నుంచే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. విద్యార్థులకు విద్యాకానుక కిట్టును అందించడం దగ్గర నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ను అందించడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులకు ట్యాబ్ లను అందించి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ విధమైన అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గుర్తించడంతోపాటు వాటికి తక్షణ పరిష్కారం చూపుతున్న శాసనసభ్యులు పేర్ని నాని కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు.
మాజీ మంత్రి, శాసనసభ్యులు పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఏ ఒక్క విద్యార్థి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కాకుండా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ముఖ్యమంత్రి బాటలు నిర్మించారని కొనియాడారు. ప్రతి విద్యార్థి ఏ చీకూచింతా లేకుండా సంతోషంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.
తపసిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెరక పనులు చేయించడంతోపాటు సైకిల్ షెడ్ నిర్మాణం, సిరివెళ్లపాలెంలోని పాఠశాలకు ఆటస్థలం, కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సైకిల్ షెడ్ నిర్మాణం, అదనపు తరగతుల నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్, శాసనసభ్యులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా, బందరు ఆర్టీవో ఐ కిషోర్, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డిప్యూటీ డిఇఓ సుబ్బారావు, ఎంఈఓ ప్రసాద్, బందరు తాసిల్దార్ డి సునీల్ బాబు, గ్రామ సర్పంచ్ మస్తాన్ రావు, ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వర రావు, తాళ్లపాలెం మాజీ ప్రెసిడెంట్ వాలిసెట్టి రవిశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …